KV Palle: కేవీపల్లిలో 77 గ్రాముల బంగారం చోరీ కేసు ఛేదన ముగ్గురు అరెస్ట్!
KV Palle: కేవీపల్లి లక్ష్మిరెడ్డిగారిపల్లిలో 77 గ్రాముల బంగారు నగలు చోరీ చేసిన ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు. నిందితుల రిమాండ్.
KV Palle: కేవీపల్లిలో 77 గ్రాముల బంగారం చోరీ కేసు ఛేదన ముగ్గురు అరెస్ట్!
KV Palle: ఇంట్లో చోరీకి గురైన 77 గ్రాముల బంగారు నగల కేసును కేవీపల్లి పోలీసులు ఛేదించారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
కేవీపల్లి మండలం లక్ష్మిరెడ్డిగారిపల్లికి చెందిన నాజర్ భాష ఇంట్లో ఈ నెల 17న 77 గ్రాముల బంగారు నగలు చోరీ అయ్యాయి. దీనిపై బాధితుడు కేవీపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఎస్‌ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
దర్యాప్తులో భాగంగా నాజర్ భాష ఇంటికి తరచూ వచ్చి వెళ్తున్న అదే గ్రామానికి చెందిన అప్సానా (19)పై పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఆమెను విచారించగా బంగారు నగలు చోరీ చేసినట్లు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.
చోరీ చేసిన నగలను పీలేరులోని కాటువకాలవ వీధిలో నివాసం ఉంటున్న ఖాజా (23), సలీమా (30) వద్ద ఉంచినట్లు దర్యాప్తులో వెల్లడైంది. వీరిలో ఇద్దరు నిందితులు 40 గ్రాముల బంగారాన్ని ముత్తూట్ ఫైనాన్స్‌లో తాకట్టు పెట్టగా, మిగిలిన 33.8 గ్రాముల బంగారాన్ని తమ వద్ద ఉంచుకున్నట్లు పోలీసులు గుర్తించారు.
ముగ్గురు నిందితులను శుక్రవారం ఉదయం వగల్లు బస్టాండ్ వద్ద అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. అనంతరం రిమాండ్‌కు తరలించారు. ఇద్దరు మహిళా నిందితులను చిత్తూరు సబ్‌జైలుకు తరలించినట్లు పోలీసులు తెలిపారు.




