VerSe Innovation ఇండిపెండెంట్ డైరెక్టర్ గా పీఆర్ రమేష్ నియామకం

VerSe Innovation: డిజిటల్ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేసే VerSe Innovation ఇండిపెండెంట్ డైరెక్టర్ గా పీఆర్ రమేష్ నియమితులయ్యారు.

KVD Varma
Published on: 31 March 2026 5:39 PM IST
VerSe Innovation ఇండిపెండెంట్ డైరెక్టర్ గా పీఆర్ రమేష్
X

VerSe Innovation

VerSe Innovation: "డిజిటల్ రంగంలో VerSe అద్భుతమైన స్థాయికి చేరుకుంది. సంస్థ వృద్ధి చెందుతున్న కొద్దీ జవాబుదారీతనం, రిస్క్ మేనేజ్‌మెంట్ వంటి వ్యవస్థలు కూడా అదే స్థాయిలో పటిష్టంగా ఉండాలి. బాధ్యతాయుతమైన వృద్ధి దిశగా మేనేజ్‌మెంట్ టీంతో కలిసి పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను" అని VerSe Innovation' ఇండిపెండెంట్ డైరెక్టర్ గా నియమితులైన పి.ఆర్. రమేష్ అన్నారు.

VerSe Innovation ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారంగా పనిచేసే లోకల్ లాంగ్వేజ్ టెక్నాలజీ ప్లాట్ ఫామ్. ఈ సంస్థ ఇప్పుడు తన వ్యూహాత్మక వృద్ధిలో భాగంగా కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోనే అత్యంత అనుభవం ఉన్న ఫైనాన్షియల్ అడ్వైజర్లలో ఒకరిగా పరిగణించే పీఆర్ రమేష్ ను ఇండిపెండెంట్ డైరెక్టర్ గా నియమించింది. ఈయన బోర్డులో సభ్యుడిగా మాత్రమే కాకుండా ఆడిట్ కమిటీ చైర్మన్ గా కూడా వ్యవహరిస్తారని కంపెనీ పేర్కొంది.

నాలుగు దశాబ్దాల అనుభవశాలి పీఆర్ రమేష్

డెలాయిట్ ఇండియా చైర్మన్ గా గతంలో పనిచేసిన వీఆర్ రమేష్ చార్టెడ్ ఎకౌంటెంట్ గా 40 ఏళ్లకు పైగా విశేష అనుభవం ఉన్నవారు. అంతేకాకుండా యన డెలాయిట్ గ్లోబల్ బోర్డులో కూడా సభ్యుడిగా ఉన్నారు.

ప్రస్తుతం పీఆర్ రమేష్ వివిధ దిగ్గజ సంస్థల బోర్డుల్లో కొనసాగుతున్నారు. ఎయిర్ ఇండియా, సిప్లా, నెస్లే ఇండియా, ఎల్ అండ్ టీ సంస్థల బోర్డులో ఆయన ఉన్నారు. సెబీ, ఆర్బీఐ, ఐఆర్డీఏ వంటి సంస్థల అడ్వైజరీ కమిటీలో సభ్యుడిగా.. దేశ ఆర్ధిక ప్రమాణాల రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన ఆర్ధిక అనుభవ శాలి పీఆర్ రమేష్.

2022-23 సంవత్సరానికి ఆసియా సెంటర్ ఫర్ కార్పొరేట్ గవర్నెన్స్ ఇచ్చే “బెస్ట్ ఇండిపెండెంట్ డైరెక్టర్” పీఆర్ రమేష్ అందుకున్నారు.

పీఆర్ రమేష్ నియామకం సందర్భంగా VerSe సహ-వ్యవస్థాపకుడు ఉమంగ్ బేడీ మాట్లాడుతూ ఒక సంస్థ కాలపరీక్షను తట్టుకొని నిలబడాలంటే బలమైన ఆర్థిక క్రమశిక్షణ, పారదర్శకత అవసరమని చెప్పారు. పీఆర్ రమేష్ అనుభవం తమ గవర్నెన్స్ ప్రమాణాలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళుతుందనే ఆశాభావం ఆయన వ్యక్తం చేశారు.

KVD Varma

KVD Varma

జర్నలిజం రంగంలో 18 ఏళ్ల సుదీర్ఘ అనుభవం నాది. 2008లో సాక్షి పత్రికలో రిపోర్టర్‌గా ప్రస్థానం ప్రారంభించి, ఆపై వివిధ పత్రికల్లో రిపోర్టర్ గా, బ్యూరో చీఫ్‌గా బాధ్యతలు నిర్వహించాను. డిజిటల్ విప్లవంతో ఇటువైపు ప్రయాణంలో భాగంగా HMTVతో ప్రారంభించి TV9, RTV, Mahaa News వంటి అగ్రగామి సంస్థల్లో డిజిటల్ జర్నలిస్టుగా పనిచేశాను. ప్రస్తుతం HMTV వెబ్‌సైట్ వేదికగా పాఠకులకు తాజా వార్తలను అందిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ పరిణామాలను గమనిస్తూ.. హిందీ, ఇంగ్లీష్ వార్తలను తెలుగు పాఠకుల అభిరుచికి అనుగుణంగా అనువదించి, విశ్లేషణాత్మక కథనాలను అందించడం నా ప్రత్యేకత.

Next Story