IPO: వచ్చే వారం మార్కెట్లోకి 3 కొత్త ఐపీఓలు.. రేసులో దూసుకుపోతున్న టాప్ కంపెనీ ఇదే!

IPO: వచ్చే వారం మార్కెట్లోకి యశ్వీ జ్యువెలర్స్, రాజనందిని ఫ్యాషన్, SMR జ్యువెల్స్ SME ఐపీఓలు రానున్నాయి.

Naresh.k
Published on: 27 May 2026 3:05 PM IST
IPO
X

IPO: వచ్చే వారం మార్కెట్లోకి 3 కొత్త ఐపీఓలు.. రేసులో దూసుకుపోతున్న టాప్ కంపెనీ ఇదే!

Upcoming SME IPO: పెట్టుబడిదారులకు ప్రతి వారంలాగే వచ్చే వారం కూడా ప్రైమరీ మార్కెట్ మంచి అవకాశాలను మోసుకొస్తోంది. ఈసారి ఏకంగా మూడు కొత్త SME కేటగిరీ ఐపీఓలు ఇన్వెస్టర్లను పలకరించేందుకు సిద్ధమయ్యాయి. మార్కెట్లోకి అడుగుపెడుతున్న ఆ మూడు ఐపీఓలు యశ్వీ జ్యువెలర్స్ , రాజనందిని ఫ్యాషన్ ఇండియా, ఎస్ఎంఆర్ జ్యువెల్స్. ప్రస్తుతానికి గ్రే మార్కెట్ ప్రీమియం రేసులో ఏ కంపెనీ పైచేయి సాధించింది? ఏ ఐపీఓ వివరాలు ఎలా ఉన్నాయో ఒక లుక్ వేద్దాం.

1. యశ్వీ జ్యువెలర్స్ ఐపీఓ

బంగారు గొలుసులు , వివిధ రకాల ఆభరణాల తయారీ మరియు వ్యాపారంలో ఉన్న ఈ జైపూర్ ఆధారిత కంపెనీ ఫిక్స్‌డ్ ప్రైస్ ఇష్యూతో మార్కెట్లోకి వస్తోంది. సబ్‌స్క్రిప్షన్ తేదీలు మే 25న ప్రారంభమై మే 27తో ముగుస్తుంది. ఒక్కో షేరుకు రూ.83 ఫిక్స్‌డ్ ధరగా నిర్ణయించారు. ఇన్వెస్టర్లు కనీసం రూ.2,65,600 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఇన్వెస్టర్‌గెయిన్ ,మార్కెట్ వర్గాల ప్రకారం, దీని జీఎంపీ ప్రస్తుతం సున్నాగా ఉంది. అంటే గ్రే మార్కెట్‌లో ప్రస్తుతానికి ఎలాంటి అదనపు ప్రీమియం లభించడం లేదు.

2. రాజనందిని ఫ్యాషన్ ఇండియా ఐపీఓ

మహిళల ఎత్నిక్ వేర్, క్యాజువల్ వేర్ దుస్తుల డిజైనింగ్ ,తయారీ రంగంలో ఉన్న సూరత్, జైపూర్ లలో ప్లాంట్లు కలిగిన టెక్స్‌టైల్ కంపెనీ ఇది. ప్రస్తుతానికి ఈ మూడు ఐపీఓల్లో ఇదే హాట్ టాపిక్‌గా నిలుస్తోంది. సబ్‌స్క్రిప్షన్ తేదీలు మే 26న ప్రారంభమై మే 29తో ముగుస్తుంది. ఒక్కో షేరుకు రూ.59 నుండి రూ.63గా ఫిక్స్ చేశారు. ఈ మూడు కంపెనీల్లో రాజనందిని ఫ్యాషన్ ఇండియానే అత్యధిక జీఎంపీని కలిగి ఉంది. ప్రస్తుతం గ్రే మార్కెట్‌లో దీని షేరుపై రూ.6 నుండి రూ.8 వరకు ప్రీమియం నడుస్తోంది. ఇది ఇష్యూ ధర కంటే దాదాపు 10% పైగా లాభాన్ని సూచిస్తూ ఇన్వెస్టర్లలో సానుకూల అంచనాలను పెంచుతోంది.

3. ఎస్ఎంఆర్ జ్యువెల్స్ ఐపీఓ

గుజరాత్ ఆధారిత ఈ సంస్థ బ్రైడల్, సాంప్రదాయ హెరిటేజ్ జ్యువెలరీ డిజైనింగ్ ,పంపిణీ వ్యాపారంలో ఉంది. అసెట్-లైట్ మోడల్‌లో నడిచే ఈ కంపెనీ ప్రముఖ రిటైలర్లకు ఆభరణాలను సరఫరా చేస్తుంది. సబ్‌స్క్రిప్షన్ తేదీలు మే 26న ప్రారంభమై మే 29తో ముగుస్తుంది. ఒక్కో షేరుకు రూ.128 నుండి రూ.135గా నిర్ణయించారు. కనీస రిటైల్ ఇన్వెస్ట్‌మెంట్ రూ.2.7 లక్షలు. ఈ ఐపీఓపై మార్కెట్లో బిజినెస్ పరంగా మంచి అంచనాలు ఉన్నప్పటికీ, ప్రస్తుతం దీని జీఎంపీ కూడా సున్నా వద్దే కొనసాగుతోంది.

ప్రస్తుతానికైతే రేసులో రాజనందిని ఫ్యాషన్ ఇండియా మాత్రమే పాజిటివ్ ప్రీమియంతో ముందంజలో ఉంది. అయితే, రిటైల్ ఇన్వెస్టర్లు కేవలం జీఎంపీని మాత్రమే కాకుండా, కంపెనీల ఆర్థిక బలాబలాలు , భవిష్యత్తు వృద్ధి అవకాశాలను పరిశీలించి, అవసరమైతే సెబీ రిజిస్టర్డ్ ఆర్థిక నిపుణుల సలహాతో పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమం.

Naresh.k

Naresh.k

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story