Gold Rate Today : పసిడి ప్రియులకు అబ్బా సాయిరాం గుడ్ న్యూస్.. మళ్లీ దిగివచ్చిన బంగారం, వెండి ధరలు
Gold Rate Today : దేశీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,51,090 వద్ద, 22 క్యారెట్ల ధర రూ.1,38,490 వద్ద స్థిరపడింది.
Gold Rate Today
Gold Rate Today : బంగారం, వెండి ఆభరణాలు కొనాలనుకునే వారికి గురువారం ఉదయం అదిరిపోయే శుభవార్త అందింది. గత కొద్ది రోజులుగా స్థిరంగా పెరుగుతూ సరికొత్త రికార్డులను సృష్టించిన పసిడి ధరలు ఎట్టకేలకు దారికి వచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లలో డాలర్ విలువ పెరగడం, సురక్షిత పెట్టుబడిగా బంగారంపై డిమాండ్ కాస్త తగ్గడంతో దేశీయ మార్కెట్లలో కూడా పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి. నిన్నటితో పోల్చుకుంటే గురువారం (జూన్ 18, 2026) ఉదయానికి బంగారం, వెండి ధరల్లో సానుకూల మార్పులు కనిపించాయి.
ప్రస్తుతం దేశీయ బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,51,090 వద్ద కొనసాగుతోంది. నిన్న బుధవారం ఈ ధర రూ.1,51,360 గా ఉండేది, అంటే నిన్నటితో పోలిస్తే రూ.300 వరకు రేటు దిగొచ్చింది. అదేవిధంగా, ఆభరణాల తయారీలో ఎక్కువగా ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం ధరపై రూ.200 పైగా తగ్గి.. ప్రస్తుతం 10 గ్రాముల ధర రూ.1,38,490 వద్ద స్థిరపడింది. ఈ స్వల్ప తగ్గుదల వివాహాది శుభకార్యాల కోసం నగలు చేయించుకునే మధ్యతరగతి కుటుంబాలకు మంచి ఉపశమనాన్ని ఇస్తోంది.
మరోవైపు పారిశ్రామిక డిమాండ్ కలిగిన వెండి కూడా బంగారం బాటలోనే నడుస్తూ కొనుగోలుదారులకు ఊరటనిచ్చింది. ప్రస్తుతం దేశీయ మార్కెట్‌లో ఒక కిలో గ్రాము వెండి ధర రూ.2,64,900 వద్ద ట్రేడ్ అవుతోంది. అయితే, స్థానిక పన్నులు, రవాణా ఖర్చుల ఆధారంగా దక్షిణాది నగరాల్లో వెండి ధర కొంత అదనంగా ఉంది. ముఖ్యంగా హైదరాబాద్, విజయవాడ వంటి నగరాల్లో కిలో వెండి ధర ప్రస్తుతం రూ.2,74,900 వద్ద కొనసాగుతుండటం గమనార్హం.
దేశంలోని వేర్వేరు నగరాల్లో స్థానిక అసోసియేషన్ల నిర్ణయాల ప్రకారం ధరల్లో స్వల్ప వ్యత్యాసాలు ఉన్నాయి. భాగ్యనగరం హైదరాబాద్‌తో పాటు విజయవాడ, విశాఖపట్నం నగరాలలో ఈరోజు ధరలు ఒకేలా కొనసాగుతున్నాయి. ఈ మూడు నగరాలలో 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.1,51,090 వద్ద ఉండగా.. 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర రూ.1,38,490 గా ఉంది. అలాగే ఈ మూడు నగరాల్లోనూ కిలో వెండి ధర రూ.2,74,900 వద్ద విక్రయించబడుతోంది.
కర్ణాటక రాజధాని బెంగళూరుతో పాటు దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో కూడా బంగారం రేట్లు ఒకే రీతిన రికార్డయ్యాయి. ఈ రెండు నగరాల్లోనూ శుద్ధమైన 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,51,090 పలుకుతుండగా, 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,38,490 వద్ద స్థిరంగా ఉంది. అయితే ఈ నగరాల్లో వెండి ధర దక్షిణాదితో పోలిస్తే కాస్త తక్కువగా ఉంది. బెంగళూరు, ముంబైలలో కిలో వెండి ధర ప్రస్తుతం రూ.2,64,900 లుగా కొనసాగుతోంది.
దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర రూ.1,51,240 వద్ద ఉండగా, ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల ధర రూ.1,36,640 గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.2,64,900 గా నమోదైంది. మరోవైపు తమిళనాడు రాజధాని చెన్నైలో బంగారం ధర దేశంలోనే అత్యధికంగా ఉంది. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,53,050 వద్ద కొనసాగుతుండగా, 22 క్యారెట్ల ధర రూ.1,40,290 వద్ద ఉంది. ఇక్కడ కిలో వెండి రేటు రూ.2,74,900 లుగా విక్రయమవుతోంది.




