Chicken Shop Bandh: రాష్ట్రవ్యాప్తంగా చికెన్ షాపులు బంద్.. మాంసాహార ప్రియులకు తప్పని తిప్పలు!
Chicken Shop Bandh: తెలంగాణవ్యాప్తంగా నేడు చికెన్ షాపుల బంద్. కిలో చికెన్‌పై ఇచ్చే రిటైల్ మార్జిన్‌ను రూ. 30కి పెంచాలని డిమాండ్ చేస్తూ వ్యాపారులు సమ్మెకు దిగారు.
Chicken Shop Bandh: రాష్ట్రవ్యాప్తంగా చికెన్ షాపులు బంద్.. మాంసాహార ప్రియులకు తప్పని తిప్పలు!
Chicken Shop Bandh: నేటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా చికెన్ షాపులు బంద్ పాటిస్తున్నాయి. రిటైల్ చికెన్ షాపులకు ఇచ్చే మార్జిన్ పెంచాలని డిమాండ్ చేస్తూ.. రాష్ట్ర చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ చికెన్ షాపు బంద్ కు పిలుపునిచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా చికెన్ షాపులను బంద్ చేశారు. పౌల్ట్రీ కంపెనీలు తమకు ఇచ్చే లాభం తగ్గించడంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని.. ఈ మార్జిన్ ను పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.
గతంలో పౌల్ట్రీ వాళ్లు రిటైల్ షాపులకు కేజీకి 26 రూపాయలు మార్జిన్ ఇచ్చే వారని, గత 20 ఏళ్లుగా ఇలాగే ఉండేదని.. తాజాగా.. మార్జిన్ ను 16 రూపాయలకు తగ్గించారని వాపోయారు. కేజీ చికెన్ కు మార్జిన్ 30 రూపాయలు చేయాలని చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు డిమాండ్ చేశారు. చికెన్ షాపుల బంద్ కారణంగా చికెన్ విక్రయాలు నిలిచిపోయాయి. మాంసాహార ప్రియులు ఇబ్బందులు పడ్డారు.
సూర్యాపేటలో చికెన్ వ్యాపారులు బంద్ పాటించి.. నిరసన ర్యాలీ చేపట్టారు. పౌల్ట్రీ యజమానుల వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ముప్పై ఏళ్ల క్రితం నిర్ణయించిన మార్జిన్‌ను ఇప్పటికీ కొనసాగించడం అన్యాయమని
అసోసియేషన్ ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. షాపు అద్దెలు, కూలీల వేతనాలు, గ్యాస్ ధరలు భారీగా పెరిగాయని.. తమకు లాభం మాత్రం పెరగలేదంటున్నారు. ప్రభుత్వం, పౌల్ట్రీ యాజమాన్యాలు స్పందించి మార్జిన్ శాతం పెంచాలని డిమాండ్ చేశారు.




