Sugar Price Drop: తగ్గిన చక్కెర ధరలు.. కిలో రిటైల్ ధర ఎంతంటే?

Sugar Price Drop: దేశంలో చక్కెర సగటు రిటైల్ ధర కిలోకు రూ.62.57కి తగ్గింది. ప్రభుత్వ చర్యల వల్ల ధరలు తగ్గినట్లు అధికారిక గణాంకాలు వెల్లడించాయి.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 4 Sept 2026 6:54 AM IST
Sugar Price Drop
X

Sugar Price Drop: తగ్గిన చక్కెర ధరలు.. కిలో రిటైల్ ధర ఎంతంటే?

Sugar Price Drop: దేశంలో చక్కెర ధరల అకస్మాత్తు పెరుగుదలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం వేగంగా స్పందించింది. దిగుమతులకు అనుమతి ఇవ్వడంతో పాటు వ్యాపారులు, డీలర్లపై నిల్వ పరిమితి నిబంధనలను కఠినతరం చేయడంతో మార్కెట్‌లో చక్కెర ధరలు దిగివచ్చాయి. ప్రభుత్వ చర్యల ఫలితంగా వారం వ్యవధిలోనే దేశవ్యాప్తంగా సగటు రిటైల్ ధర 3.85 శాతం తగ్గి, కిలో చక్కెర రూ. 62.57కి చేరినట్లు వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారిక గణాంకాలు వెల్లడించాయి. వారం క్రితం ఇది రూ. 65.08గా ఉండేది. అయితే, గత నెలలోని రూ. 49.33 ధరతో పోలిస్తే ప్రస్తుత ధరలు ఇంకా 27 శాతం అధికంగానే ఉన్నాయి.

మరోవైపు టోకు మార్కెట్‌లో కూడా చక్కెర ధరల సడలింపు కనిపిస్తోంది. వారం క్రితం కిలోకు రూ. 60.39గా ఉన్న టోకు ధర సెప్టెంబర్ 2 నాటికి రూ. 57.62కి పడిపోయింది. అయితే టోకు ధరల్లో వచ్చిన ఈ తగ్గుదల సాధారణ వినియోగదారునికి చేరడానికి కనీసం 10 రోజుల సమయం పడుతుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. గతంలో అధిక ధరలకు సరుకు కొనుగోలు చేసిన రిటైల్ వ్యాపారులు, పాత నిల్వలు పూర్తయ్యే వరకు ధరలను వెంటనే తగ్గించకపోవడమే దీనికి కారణమని అధికారులు వెల్లడించారు.

కాగా, చక్కెర ధరల అదుపు కోసం ప్రభుత్వం 10 లక్షల టన్నుల చక్కెర దిగుమతికి అనుమతివ్వడంతో పాటు మిల్లుల వద్ద తగినంత నిల్వలు ఉన్నాయని స్పష్టం చేసింది. సాధారణంగా దేశీయంగా వార్షికంగా 280 నుండి 285 లక్షల టన్నుల చక్కెర అవసరం కాగా, 2025-26 మార్కెటింగ్ సంవత్సరానికి గాను ఉత్పత్తి అంచనాను 343 లక్షల టన్నుల నుండి 306 లక్షల టన్నులకు ప్రభుత్వం ఇటీవల సవరించింది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story