Stock Market Crash: స్టాక్ మార్కెట్ క్రాష్.. కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ!
Stock Market Crash: పశ్చిమాసియాలో అమెరికా-ఇరాన్ మధ్య రాజుకున్న తాజా ఉద్రిక్తతల కారణంగా భారత స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోయాయి.
Stock Market Crash: స్టాక్ మార్కెట్ క్రాష్.. కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ!
Stock Market: గడిచిన కొన్ని రోజులుగా లాభాలతో దూసుకుపోతున్న భారత స్టాక్ మార్కెట్లకు ఒక్కసారిగా బ్రేకులు పడ్డాయి. బుధవారం ట్రేడింగ్‌లో దేశీయ బెంచ్‌మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ 50 భారీగా నష్టపోయాయి. అంతర్జాతీయంగా, ముఖ్యంగా పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు రాజుకోవడమే ఇందుకు ప్రధాన కారణం. అమెరికా-ఇరాన్ మధ్య మొదలైన తాజా వివాదం ఇన్వెస్టర్ల గుండెల్లో గుబులు రేపింది.
ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన కాసేపటికే మార్కెట్లు కుప్పకూలాయి. ఒక దశలో ఏకంగా 625 పాయింట్లు (0.80 శాతం) నష్టపోయి 77,555.52 పాయింట్ల కనిష్టానికి పడిపోయింది. 191 పాయింట్లు (0.79 శాతం) క్షీణించి 24,207.20 వద్ద మునిగింది.
మధ్యాహ్నం 11:45 గంటల సమయానికి సెన్సెక్స్ 471 పాయింట్ల నష్టంతో 77,709 వద్ద, నిఫ్టీ 148 పాయింట్లు నష్టపోయి 24,250 వద్ద ట్రేడవుతూ కాస్త కోలుకునే ప్రయత్నం చేసినా.. మార్కెట్లో నెగిటివిటీ స్పష్టంగా కనిపించింది. ఎన్‌ఎస్‌ఈ డేటా ప్రకారం.. 1,100 షేర్లు లాభాల్లో ఉంటే, ఏకంగా 1,805 షేర్లు నష్టాల్లో పయనించడం మార్కెట్ బలహీనతను చూపిస్తోంది.
ఈ మార్కెట్ క్రాష్‌కు ప్రధాన విలన్.. అమెరికా-ఇరాన్ మధ్య రాజుకున్న తాజా వివాదమే. హార్ముజ్ జలసంధిలో మూడు ఆయిల్ ట్యాంకర్లపై దాడులు జరగడంతో.. అమెరికా సైన్యం మంగళవారం ఇరాన్‌పై సరికొత్త వైమానిక దాడులకు దిగింది. అంతటితో ఆగకుండా ఇరాన్ చమురు విక్రయించే లైసెన్స్‌ను కూడా రద్దు చేసింది. దీంతో అంతర్జాతీయంగా చమురు సరఫరాకు విఘాతం కలుగుతుందేమోనన్న భయాలు మార్కెట్లను ముంచేశాయి.
ఈ దెబ్బకు సెక్టార్లన్నీ ఎరుపు రంగులోకి మారిపోయాయి. ముఖ్యంగా నిఫ్టీ ఆటో, నిఫ్టీ ఎఫ్‌ఎమ్‌సీజీ, నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్, పీఎస్‌యూ బ్యాంక్స్ ఇండెక్స్‌లు 1 శాతానికి పైగా నష్టపోయాయి. మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ ఇండెక్స్‌లు కూడా దాదాపు 0.30% నుండి 0.42% వరకు క్షీణించాయి.
సెన్సెక్స్ 30 షేర్లలో ఏషియన్ పెయింట్స్, ఐటీసీ , ఇండిగో షేర్లు అత్యధికంగా 2 శాతానికి పైగా పడిపోయాయి. వీటితో పాటు మారుతీ, బజాజ్ ఫైనాన్స్, హిందుస్థాన్ యూనీలివర్ , రిలయన్స్ , బెల్ కంపెనీలు కూడా భారీగా నష్టపోయాయి. : ఇంతటి ఘోరమైన మార్కెట్లోనూ సన్ ఫార్మా, అదానీ పోర్ట్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్,
ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా షేర్లు మాత్రమే లాభాల్లో రాణించి మార్కెట్‌కు కాస్త అండగా నిలిచాయి. ప్రస్తుతానికి గ్లోబల్ మార్కెట్ సెంటిమెంట్ బలహీనంగా ఉండటంతో ఇన్వెస్టర్లు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టే వరకు మార్కెట్లలో ఇటువంటి ఒడిదుడుకులు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు.




