Silver Loan: వెండిపై లోన్‌ తీసుకోవాలనుకుంటున్నారా... ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి

Silver Loan Guide: వెండిపై చాలా బ్యాంకులు ఇప్పుడు రుణాలు ఇస్తున్నాయి. అయితే, వెండిని తాకట్టుపెట్టి లోన్‌ తీసుకోవాలనుకునే ముందు కొన్ని విషయాలను తప్పనిసరిగా తెలుసుకోవాలి.

Balachander
Published on: 5 April 2026 1:40 PM IST
Silver Loan Guide Key Things You Must Know Before Taking a Loan Against Silver
X

Silver Loan

Loan Against Silver: దేశంలో సంక్షోభ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అన్ని రంగాల్లోకి ఏఐ టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో చాలా మంది ఉద్యోగాలు కొల్పోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో డబ్బు అవసరం వచ్చినపుడు వెంటనే గోల్డ్‌లోన్‌ వైపు మొగ్గుచూపుతారు. అయితే, ప్రస్తుత పరిస్థితులను బట్టి చేతిలో బంగారం లేనివారు ప్రత్యామ్నాయంగా వెండిని తాకట్టు పెట్టి లోన్‌ తీసుకోవాలని చూస్తున్నారు. వెండిపై చాలా బ్యాంకులు ఇప్పుడు రుణాలు ఇస్తున్నాయి. అయితే, వెండిని తాకట్టుపెట్టి లోన్‌ తీసుకోవాలనుకునే ముందు కొన్ని విషయాలను తప్పనిసరిగా తెలుసుకోవాలి.

వెండిపై లోన్‌ పరిమితి

బంగారం మాదిరిగా వెండిపై లోన్‌ గరిష్టంగా రాదు. రుణపరిమితి తప్పనిసరిగా ఉంటుంది. లక్షరూపాయల విలువైన వెండి మన దగ్గర ఉంటే అంతే మొత్తాన్ని బ్యాంకులు లోన్లుగా ఇస్తాయని అనుకుంటాం. కానీ, ఇది వాస్తవం కాదు. సాధారణంగా ఏ బ్యాంకులైనా సరే వెండి విలువలో కేవలం 75 నుంచి 85 శాతం వరకు మాత్రమే లోన్‌గా ఇవ్వడానికి ముందుకు వస్తాయి. అంటే లక్ష రూపాయల విలువైన వెండి ఉంటే లోక్‌ కింద మనకు 75,000 నుంచి 85,000 వరకు మాత్రమే లోన్‌ వస్తుంది. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. బంగారంతో పోలిస్తే వెండి ధరలు మార్కెట్లో వేగంగా పెరగడం అంతే వేగంగా తగ్గడం వంటివి జరుగుతుంటాయి. ఈరోజు గ్రాము రూ. 200 ఉన్న వెండి రేపటికి రూ. 150 కి పడిపోవచ్చు. ఈ రిస్క్‌ను దృష్టిలో ఉంచుకొని బ్యాంకులు పూర్తిస్థాయి విలువ ఇవ్వకుండా కొంత మొత్తాన్ని సేఫ్టీ మార్జిన్‌గా ఉంచుకుంటారు.

వెండి స్వచ్చత

ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి. అన్ని రకాలైన వెండి వస్తువులకు ఒకేవిధమైన విలువ ఉండదు. వెండి ఆభరణాలు, నాణేలు వంటి వాటి స్వచ్చతను సులభంగా అంచనావేయవచ్చు. వీటిపై రుణాలు త్వరగా లభిస్తాయి. కానీ, వెండి పాత్రలు, అలంకరణ వస్తువుల విషయంలో బ్యాంకులు చాలా జాగ్రత్తలు తీసుకుంటాయి. వీటి విలువ తక్కువగా ఉంటుంది. ఇక్కడ గమనించవలసిన మరో ముఖ్యమైన విషయం ఏమంటే మేకింగ్‌ చార్జీలు. వెండి వస్తువులు కొనుగోలు చేసినపుడు మేకింగ్‌ చార్జీలు తీసుకుంటారు. కానీ, బ్యాంకులు స్వచ్చతను మాత్రమే చూస్తారు. మేకింగ్‌ చార్జీలను పరిగణలోకి తీసుకోరు. లోన్‌ తీసుకునే ముందు వడ్డీ రేట్లు కూడా పరిశీలించుకోవడం అవసరం. వెండిపై సుమారు 10 నుంచి 18 శాతం మధ్య వడ్డీరేట్లు ఉంటాయి. వీటితో పాటు కొన్ని ఫైనాన్స్‌ సంస్థలు ప్రాసెసింగ్‌ ఫీజు, లేట్‌ పేమెంట్‌ చార్జీలు వంటివి కూడా అదనంగా బనాయిస్తుంటాయి. కాబట్టి వెండిపై లోన్‌ తీసుకునే ముందు ఈ విషయాలన్నింటిని దృష్టిలో ఉంచుకొని మాత్రమే అడుగు వేయాలి.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story