FD Rates: సీనియర్ సిటిజన్లకు శుభవార్త.. 5 ఏళ్ల FDపై 8.05% వరకు వడ్డీ
FD Rates: దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం, మార్కెట్లో మారుతున్న పరిస్థితుల మధ్య ఫిక్స్డ్ డిపాజిట్లు (FDలు) ఇప్పటికీ సీనియర్ సిటిజన్లకు అత్యంత భద్రమైన పెట్టుబడి మార్గంగా కొనసాగుతున్నాయి.
FD Rates: సీనియర్ సిటిజన్లకు శుభవార్త.. 5 ఏళ్ల FDపై 8.05% వరకు వడ్డీ
FD Rates: దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం, మార్కెట్లో మారుతున్న పరిస్థితుల మధ్య ఫిక్స్డ్ డిపాజిట్లు (FDలు) ఇప్పటికీ సీనియర్ సిటిజన్లకు అత్యంత భద్రమైన పెట్టుబడి మార్గంగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా కొన్ని స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు 5 ఏళ్ల FDలపై వృద్ధులకు 8.05 శాతం వరకు వడ్డీ అందిస్తున్నాయి.
అత్యధిక వడ్డీ ఇస్తున్న బ్యాంకులు ఇవే
ప్రస్తుతం సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ సీనియర్ సిటిజన్లకు 5 ఏళ్ల FDపై అత్యధికంగా 8.05 శాతం వడ్డీ ఇస్తోంది. జనా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 7.77 శాతం, ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 7.70 శాతం వరకు వడ్డీ అందిస్తున్నాయి.
అలాగే ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఉత్త్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్లు కూడా 7.50 శాతం వరకు రాబడి ఇస్తున్నాయి. పెద్ద బ్యాంకులతో పోలిస్తే చిన్న ఫైనాన్స్ బ్యాంకులు ఎక్కువ మంది డిపాజిటర్లను ఆకర్షించేందుకు అధిక వడ్డీ రేట్లు ప్రకటిస్తున్నాయి.
చిన్న బ్యాంకులు ఎందుకు ఎక్కువ వడ్డీ ఇస్తున్నాయి?
ఫైనాన్స్ నిపుణుల ప్రకారం, చిన్న ఫైనాన్స్ బ్యాంకులు తమ వద్ద రిటైల్ డిపాజిట్లు పెంచుకోవడానికి ఆకర్షణీయమైన FD వడ్డీ రేట్లు అందిస్తున్నాయి. ఉత్త్కర్ష్, సూర్యోదయ్, శివాలిక్ వంటి బ్యాంకులు చాలా కాలంగా స్థిరమైన FD రేట్లను కొనసాగిస్తున్నాయని, దీంతో కస్టమర్ల నమ్మకం పెరిగిందని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి బ్యాంకులు పెద్ద బ్యాంకులతో పోటీ పడేందుకు ఎక్కువ వడ్డీని ఆయుధంగా ఉపయోగిస్తున్నాయి. అందుకే సీనియర్ సిటిజన్లు వీటిపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు.
పెట్టుబడి పెట్టే ముందు జాగ్రత్తలు తప్పనిసరి
ఎక్కువ వడ్డీ వస్తోందని చూసి వెంటనే పెట్టుబడి పెట్టడం సరైంది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా చిన్న ఫైనాన్స్ బ్యాంకుల్లో FDలు పెట్టేటప్పుడు భద్రతపై కూడా దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు. అయితే అన్ని బ్యాంకుల FDలకూ DICGC ద్వారా రూ.5 లక్షల వరకు బీమా రక్షణ ఉంటుంది. అందుకే ఒకే చిన్న బ్యాంకులో రూ.5 లక్షలకు మించి FD పెట్టకపోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అలా చేస్తే ఏదైనా సమస్య వచ్చినా డిపాజిట్ సురక్షితంగా ఉంటుంది.
FDపై TDS నిబంధనలు కూడా తెలుసుకోండి
ఒక బ్యాంకులో FDల ద్వారా సంవత్సరానికి వచ్చే వడ్డీ రూ.1 లక్ష దాటితే బ్యాంకులు TDS కట్ చేస్తాయి. అయితే 2025-26 ఆర్థిక సంవత్సరానికి కొత్త పన్ను విధానంలో రూ.12 లక్షల వరకు ఆదాయంపై పన్ను మినహాయింపు ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో పన్ను చెల్లించాల్సిన అవసరం లేని సీనియర్ సిటిజన్లు Form 15H సమర్పిస్తే TDS కోత నుంచి తప్పించుకోవచ్చు. అందువల్ల FD పెట్టుబడి చేసే ముందు ఈ నిబంధనలను తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం.




