SBI: ఎస్బీఐ నుంచి రూ. 1.4 లక్షల కోట్ల సామ్రాజ్యం సిద్ధం..!
SBI: 2026లో రాబోతున్న భారీ ఐపీఓలలో ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్మెంట్ ఒకటి.
SBI: ఎస్బీఐ నుంచి రూ. 1.4 లక్షల కోట్ల సామ్రాజ్యం సిద్ధం..!
SBI IPO: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు 2026 ఒక బంపర్ ఆఫర్ కాబోతోంది. ఇప్పటికే రిలయన్స్ జియో, ఫ్లిప్కార్ట్, జెప్టో వంటి దిగ్గజాలు క్యూలో ఉండగా.. ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్న మరో పెద్ద పేరు ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్మెంట్. దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్బీఐకి చెందిన ఈ మ్యూచువల్ ఫండ్ విభాగం, దలాల్ స్ట్రీట్లో భారీ ఎంట్రీకి సర్వం సిద్ధం చేసుకుంది. ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ ఈ ఐపీఓ ద్వారా సుమారు రూ. 14,000 కోట్లకు పైగా నిధులను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఐపీఓ రాకముందే ప్రీ-ఐపీఓ ప్లేస్మెంట్ ద్వారా రూ. 3,000 కోట్లు సమీకరించేందుకు మర్చంట్ బ్యాంకర్లతో మంతనాలు జరుపుతోంది.
ఐసీఐసీఐకి గట్టి పోటీ
ఈ సంస్థ విలువ చూస్తుంటే ఇన్వెస్టర్లు అశ్చర్యపోవాల్సిందే. మార్కెట్ అంచనాల ప్రకారం ఎస్బీఐ ఫండ్స్ వాల్యుయేషన్ రూ. 1.22 లక్షల కోట్ల నుండి రూ. 1.41 లక్షల కోట్ల వరకు ఉంటుందని భావిస్తున్నారు. ఇది 17.6 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువ కలిగిన ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ అసెట్ మేనేజ్మెంట్కు గట్టి పోటీని ఇవ్వబోతోంది. ఈ భారీ ఐపీఓను విజయవంతం చేసే బాధ్యతను 9 మంది దిగ్గజ మర్చంట్ బ్యాంకర్లకు అప్పగించారు. ఇందులో కోటక్ మహీంద్రా క్యాపిటల్,యాక్సిస్ బ్యాంక్ లిమిటెడ్,ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్, హెచ్ఎస్బీసీ హోల్డింగ్స్ వంటి ప్రముఖ సంస్థలు ఉన్నాయి.
ప్రచారం షురూ
వచ్చే వారమే మార్కెటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా నిర్వహించే రోడ్ షోలు కీలకం కానున్నాయి. ఒక కంపెనీ ఐపీఓకు వచ్చే ముందు పెద్ద పెద్ద ఇన్వెస్టర్లను ఆకర్షించడానికి చేసే ప్రచారం. కంపెనీ ఆర్థిక బలం, మేనేజ్మెంట్ పట్టు, భవిష్యత్తులో వచ్చే లాభాల గురించి ప్రెజెంటేషన్ల ద్వారా వివరిస్తారు. ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని కలిగించి, షేర్లకు డిమాండ్ పెంచడమే దీని ముఖ్య ఉద్దేశ్యం. సాధారణంగా ఎస్బీఐ వంటి నమ్మకమైన బ్రాండ్ నుండి వచ్చే ఐపీఓలకు మార్కెట్లో విపరీతమైన క్రేజ్ ఉంటుంది. లిస్టింగ్ రోజే లాభాలువస్తాయన్న ఆశతో రిటైల్ ఇన్వెస్టర్లు ఈ ఐపీఓ కోసం వేచి చూస్తున్నారు.




