SBI ఖాతాదారులకు అలర్ట్.. అక్టోబర్ 1 నుంచి క్యాష్ విత్‌డ్రాయల్ ఛార్జీల్లో మార్పులు!
SBI: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) బేసిక్ సేవింగ్స్ డిపాజిట్ అకౌంట్ (BSBD) ఖాతాదారులకు ముఖ్యమైన అప్‌డేట్ ఇచ్చింది.
SBI ఖాతాదారులకు అలర్ట్.. అక్టోబర్ 1 నుంచి క్యాష్ విత్‌డ్రాయల్ ఛార్జీల్లో మార్పులు!
SBI: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) బేసిక్ సేవింగ్స్ డిపాజిట్ అకౌంట్ (BSBD) ఖాతాదారులకు ముఖ్యమైన అప్‌డేట్ ఇచ్చింది. 2026 అక్టోబర్ 1 నుంచి క్యాష్ విత్‌డ్రాయల్‌కు సంబంధించిన సర్వీస్ ఛార్జీల్లో మార్పులు అమల్లోకి రానున్నాయి.
నెలకు 4 సార్లు మాత్రమే ఉచిత నగదు విత్‌డ్రాయల్
BSBD ఖాతాదారులు బ్రాంచ్, ATM, మైక్రో ATM, AEPS, CASH@POS వంటి మార్గాల ద్వారా నగదు తీసుకున్నా.. ఇవన్నీ క్యాష్ విత్‌డ్రాయల్ లావాదేవీలుగానే పరిగణిస్తారు. నెలలో మొదటి నాలుగు క్యాష్ విత్‌డ్రాయల్స్ ఉచితం. నాలుగు లావాదేవీలు పూర్తయిన తర్వాత నగదు తీసుకుంటే ఒక్కో లావాదేవీకి రూ.15 + GST ఛార్జీ విధిస్తారు.
అయితే UPI, IMPS, NEFT, RTGS, POS వంటి డిజిటల్ లావాదేవీలపై ఈ ఛార్జీ ఉండదు. అంటే డిజిటల్‌గా డబ్బు బదిలీ చేసే కస్టమర్లకు ఈ మార్పు వర్తించదు.
ఈ సేవలకు ఎలాంటి ఛార్జీలు ఉండవు
SBI BSBD (బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్) ఖాతాలో కొన్ని సేవలను ఉచితంగానే కొనసాగిస్తోంది. బేసిక్ రూపే ఏటీఎమ్-కమ్-డెబిట్ కార్డును ఎలాంటి ఖర్చు లేకుండా అందిస్తారు. దీనికి వార్షిక నిర్వహణ రుసుము కూడా ఉండదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన చెక్కులను డిపాజిట్ చేయడం లేదా కలెక్ట్ చేయడంపై ఎలాంటి ఛార్జీ ఉండదు. అలాగే ఇన్‌యాక్టివ్‌గా ఉన్న ఖాతాను తిరిగి యాక్టివేట్ చేసేందుకు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఖాతాను క్లోజ్ చేసినా ఛార్జీ ఉండదు.
BSBD ఖాతాను ఎవరు తెరవొచ్చు?
అవసరమైన KYC పత్రాలు ఉన్న ఎవరైనా SBIలో BSBD అకౌంట్‌ను ఓపెన్ చేయొచ్చు. ఈ ఖాతాను సింగిల్‌గా లేదా జాయింట్‌గా ఓపెన్ చేసుకునే అవకాశం ఉంది. అయితే కొత్తగా BSBD ఖాతా తెరవడానికి ముందు.. సదరు కస్టమర్‌కు దేశంలోని ఏ బ్యాంకులోనూ ఇప్పటికే మరో BSBD ఖాతా లేదని బ్యాంకుకు తెలియజేయాలి.
అలాగే ఇప్పటికే ఉన్న సాధారణ సేవింగ్స్ ఖాతాను BSBD ఖాతాగా మార్చుకోవాలన్నా ఇదే నిబంధన వర్తిస్తుంది.
BSBD ఖాతా ముఖ్యమైన ప్రయోజనాలు ఇవే
SBI BSBD ఖాతాను దేశవ్యాప్తంగా అన్ని SBI బ్రాంచుల్లో తెరవవచ్చు. ఈ ఖాతాలో మినిమమ్ యావరేజ్ బ్యాలెన్స్ (MAB) లేదా కనీస బ్యాలెన్స్‌ను నిర్వహించాల్సిన అవసరం లేదు. ఖాతాలో ఎంత మొత్తమైనా ఉంచుకోవచ్చు. బ్యాలెన్స్‌పై గరిష్ఠ పరిమితి లేదు. అర్హత ఉన్న ఖాతాదారులకు ప్రతి సంవత్సరం 25 పేజీల ఉచిత చెక్‌బుక్ కూడా అందుతుంది.
YONO, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వంటి డిజిటల్ బ్యాంకింగ్ సేవలను ఉపయోగించుకోవచ్చు. అర్హత ఉన్న వారికి బేసిక్ RuPay డెబిట్ కార్డు కూడా లభిస్తుంది. ముఖ్యంగా ఈ ఖాతాలో నెలకు ఎంత మొత్తం డిపాజిట్ చేయాలనే గరిష్ఠ పరిమితి లేదు.
అందువల్ల SBI BSBD ఖాతాదారులు అక్టోబర్ 1, 2026 నుంచి నగదు విత్‌డ్రాయల్స్ చేసే సమయంలో నెలకు నాలుగు ఉచిత లావాదేవీల పరిమితిని గుర్తుంచుకోవడం మంచిది. నాలుగు లావాదేవీల తర్వాత నగదు తీసుకుంటే రూ.15 + GST ఛార్జీ వర్తిస్తుందని తెలుసుకోవాలి.




