Retirement SIP: 50 ఏళ్లకే రిటైర్మెంట్ ప్లాన్ చేస్తున్నారా.? రూ. 10 కోట్లు కావాలంటే ఎంత SIP చేయాలంటే
Retirement SIP: ఇటీవల చాలా మంది 50 ఏళ్లకే రిటైర్ అవ్వాలని భావిస్తున్నారు.
Retirement SIP: 50 ఏళ్లకే రిటైర్మెంట్ ప్లాన్ చేస్తున్నారా.? రూ. 10 కోట్లు కావాలంటే ఎంత SIP చేయాలంటే
Retirement SIP: ఇటీవల చాలా మంది 50 ఏళ్లకే రిటైర్ అవ్వాలని భావిస్తున్నారు. ఆ తర్వాత నచ్చిన పని చేసుకుంటూ హ్యాపీగా బతికేయాలని అనుకుంటున్నారు. రిటైర్మెంట్ తర్వాత కూడా ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా జీవించాలంటే పెద్ద మొత్తంలో నిధి అవసరం అవుతుంది. అందుకే చాలా మంది రూ.10 కోట్ల రిటైర్మెంట్ కార్పస్ కావాలంటే నెలకు ఎంత SIP చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
రూ.10 కోట్ల లక్ష్యం కోసం ముందుగానే పెట్టుబడి..
రిటైర్మెంట్ కోసం పెద్ద మొత్తాన్ని కూడబెట్టాలంటే చిన్న వయసులోనే పెట్టుబడులు ప్రారంభించడం చాలా ముఖ్యం. ఎంత త్వరగా పెట్టుబడి ప్రారంభిస్తే, కాంపౌండింగ్ ప్రభావం అంత ఎక్కువగా ఉంటుంది. ప్రతి నెలా క్రమం తప్పకుండా SIP చేయడం, ఆదాయం పెరిగే కొద్దీ పెట్టుబడిని కూడా పెంచడం ద్వారా దీర్ఘకాలంలో భారీ సంపదను సృష్టించే అవకాశం ఉంటుంది. పెట్టుబడుల్లో క్రమశిక్షణ పాటించడం కూడా విజయానికి కీలక అంశం.
25 ఏళ్లలో రూ.10 కోట్ల కార్పస్ ఎలా సాధ్యం?
ఒక వ్యక్తి నెలకు రూ.25,000 SIPతో పెట్టుబడి ప్రారంభించి, ప్రతి సంవత్సరం SIP మొత్తాన్ని 10 శాతం చొప్పున పెంచుతూ 25 సంవత్సరాలు పెట్టుబడి కొనసాగిస్తే, సంవత్సరానికి సగటున 12 శాతం రాబడి వస్తుందని అంచనా వేస్తే, మొత్తం పెట్టుబడి సుమారు రూ.2.95 కోట్లు అవుతుంది. కాంపౌండింగ్ ద్వారా సుమారు రూ.7.74 కోట్ల రాబడి లభించి, చివరకు మొత్తం కార్పస్ దాదాపు రూ.10.69 కోట్లు చేరుకునే అవకాశం ఉంటుంది. అయితే ఇది మార్కెట్ పరిస్థితులు, ఫండ్ పనితీరు ఆధారంగా మారవచ్చు. 12 శాతం రాబడి అనేది కేవలం ఒక అంచనా మాత్రమే. హామీ ఇచ్చే రాబడి కాదు.
స్టెప్-అప్ 5 శాతం మాత్రమే పెంచితే ఏమవుతుంది?
ప్రతి సంవత్సరం SIPను 10 శాతం కాకుండా 5 శాతం మాత్రమే పెంచితే, అదే రూ.10 కోట్ల లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఈ పరిస్థితిలో నెలకు రూ.25,000 SIPతో ప్రారంభించి, ప్రతి సంవత్సరం 5 శాతం పెంచుతూ 28 సంవత్సరాలు పెట్టుబడి కొనసాగిస్తే, మొత్తం పెట్టుబడి సుమారు రూ.1.75 కోట్లు అవుతుంది. అంచనా ప్రకారం కాంపౌండింగ్ ద్వారా రూ.8.42 కోట్ల రాబడి వచ్చి, మొత్తం కార్పస్ దాదాపు రూ.10.17 కోట్లు చేరుకునే అవకాశం ఉంటుంది. దీని ద్వారా స్టెప్-అప్ శాతం తగ్గితే లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎక్కువ సమయం అవసరమవుతుందని అర్థమవుతోంది.
ఈ విషయాలు కచ్చితంగా గుర్తించుకోవాలి
SIPలో ప్రతి సంవత్సరం పెట్టుబడి మొత్తాన్ని పెంచడం వల్ల పెద్ద ఆర్థిక లక్ష్యాలను సులభంగా చేరుకునే అవకాశం ఉంటుంది. ఆదాయం పెరిగే కొద్దీ SIPను పెంచితే నెలవారీ భారం కూడా పెద్దగా అనిపించదు. అయితే మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటాయి. అందువల్ల 10 లేదా 25 సంవత్సరాల వంటి దీర్ఘకాలిక పెట్టుబడులు ప్రారంభించే ముందు అర్హత కలిగిన ఆర్థిక సలహాదారుడిని సంప్రదించడం మంచిది. మీ ఆదాయం, ఖర్చులు, రిస్క్ తీసుకునే సామర్థ్యం, భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని సరైన పెట్టుబడి వ్యూహాన్ని రూపొందించుకోవడం ద్వారా రిటైర్మెంట్ లక్ష్యాన్ని మరింత సులభంగా చేరుకోవచ్చు.




