Retirement Plan: రిటైర్మెంట్ తర్వాత జీతం కంటే ఎక్కువ ఆదాయం రావాలంటే తెలివిగా ఇలా చేయండి.!
Retirement Plan: రిటైర్మెంట్ తర్వాత కూడా పని చేయాల్సిన పరిస్థితి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి.?
Retirement Plan: రిటైర్మెంట్ తర్వాత జీతం కంటే ఎక్కువ ఆదాయం రావాలంటే తెలివిగా ఇలా చేయండి.!
Retirement Plan: మనం కష్టపడి సంపాదించే డబ్బును ఎలా ఆదా చేయాలి, భవిష్యత్తు కోసం ఎలా పొదుపు చేయాలి అనే విషయాలపై చాలామందికి స్పష్టమైన అవగాహన ఉండదు. ముఖ్యంగా రిటైర్మెంట్ అనగానే వయసు పైబడిన తర్వాత ఆలోచిద్దాంలే అని యువత నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ, అది ఎంత పెద్ద పొరపాటో, భవిష్యత్తులో అది ఎలాంటి ఆర్థిక ఇబ్బందులకు దారితీస్తుందో ప్రముఖ ఫైనాన్షియల్ అడ్వైజర్ యాదగిరి వివరించారు.
సాధారణంగా పెట్టుబడులు ప్రారంభించడానికి 25 నుండి 35 ఏళ్ల వయసు ఒక 'గోల్డెన్ పీరియడ్' అని చెప్పవచ్చు. కానీ, ఆర్థిక నిపుణుల వద్ద సలహాల కోసం వస్తున్న వారిలో ఈ వయసు వారు కేవలం 10 శాతం కంటే తక్కువే ఉంటున్నారు. అదే 50 నుంచి 65 ఏళ్ల వయసు వారు మాత్రం 60 శాతం మంది వస్తున్నారు. వాస్తవానికి 60 ఏళ్ల వయసులో మనం పెట్టుబడుల మీద రాబడిని తీసుకుని ప్రశాంతంగా జీవించాలి. కానీ ఆ వయసులో పెట్టుబడుల కోసం వెతకడం అంటే, ఆ వ్యక్తి తన యవ్వనంలో ఎంత విలువైన సమయాన్ని, సంపదను వృధా చేసుకున్నాడో అర్థం చేసుకోవచ్చు.
డబ్బు అనేది ఎప్పుడూ ప్రవహించే నీరు లాంటిది. వర్షం పడినప్పుడు నీటిని వదిలేస్తే అది ఎటు పడితే అటు వృధాగా పోతుంది. అదే ఒక ఆనకట్ట కట్టి ఆ నీటిని ఒడిసిపట్టుకుంటే, భవిష్యత్తులో అవసరాలకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. మన చేతికి వచ్చే జీతం కూడా అంతే! దానికి ఒక సరైన దిశానిర్దేశం ఇవ్వకపోతే అనవసరపు ఖర్చులకు కరిగిపోతుంది. అందుకే సంపాదన మొదలుపెట్టగానే పొదుపు, పెట్టుబడుల ద్వారా ఆ డబ్బును సరైన మార్గంలో మళ్లించాలి.
మన దేశంలో వృద్ధాప్యానికి చేరుకున్న తర్వాత ప్రజల ఆర్థిక పరిస్థితి ఎంతో ఆందోళనకరంగా ఉంది. కేవలం 1 శాతం మంది మాత్రమే అత్యంత ధనవంతులుగా ఉన్నారు. కేవలం 5 శాతం మంది మాత్రమే తమ రిటైర్మెంట్ జీవితాన్ని ఎవరిపైనా ఆధారపడకుండా ప్రశాంతంగా గడుపుతున్నారు. 8 శాతం మంది దయనీయ స్థితిలో బిక్షాటన చేస్తున్నారు. మరో 23 శాతం మంది వయసు పైబడినా, తప్పనిసరి పరిస్థితుల్లో ఇంకా పనులు చేస్తూనే ఉన్నారు. అత్యధికంగా 63 శాతం మంది తమ ఆర్థిక అవసరాల కోసం తమ పిల్లల మీదే ఆధారపడి బతుకుతున్నారు.




