Priyanka Chopra: పట్టుబట్టి మరీ ప్రియాంక చోప్రా కంపెనీని కొనేసిన అంబానీ..ఎందుకంటే..?

Priyanka Chopra: గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా స్థాపించిన 'అనామలీ' బ్రాండ్‌ను రిలయన్స్ రిటైల్ దక్కించుకుంది.

Naresh.k
Published on: 1 May 2026 10:35 AM IST
Priyanka Chopra
X

Priyanka Chopra: పట్టుబట్టి మరీ ప్రియాంక చోప్రా కంపెనీని కొనేసిన అంబానీ..ఎందుకంటే..?

Reliance: భారత రిటైల్ దిగ్గజం రిలయన్స్ రిటైల్ మరో సంచలనానికి తెరలేపింది. గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా స్థాపించిన పాపులర్ హెయిర్‌కేర్ బ్రాండ్ 'అనామలీ'ను రిలయన్స్ రిటైల్ పూర్తిగా స్వాధీనం చేసుకుంది. బ్యూటీ, పర్సనల్ కేర్ రంగంలో అగ్రస్థానమే లక్ష్యంగా ఇషా అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ బ్యూటీ విభాగం ఈ భారీ ఒప్పందాన్ని కుదుర్చుకుంది.

గ్లోబల్ బ్రాండ్..

2021లో ప్రియాంక చోప్రా ప్రారంభించిన 'అనామలీ', అతి తక్కువ కాలంలోనే అంతర్జాతీయంగా క్రేజ్ సంపాదించింది. రసాయన రహిత , వేగన్ ఉత్పత్తులను సామాన్యులకు కూడా అందుబాటు ధరల్లో అందించడమే ఈ బ్రాండ్ ప్రత్యేకత. ఇప్పుడు ఈ బ్రాండ్‌కు సంబంధించిన ట్రేడ్‌మార్క్‌లు, డిజిటల్ ఆస్తులు, మేధో సంపత్తి హక్కులన్నీ రిలయన్స్ రిటైల్ వశమయ్యాయి.

ఇషా అంబానీ మాస్టర్ ప్లాన్

ఈ ఒప్పందంపై రిలయన్స్ రిటైల్ వెంచర్స్ డైరెక్టర్ ఇషా అంబానీ హర్షం వ్యక్తం చేశారు. అనామలీ నాణ్యత, గ్లోబల్ అప్పీల్ రిలయన్స్ బ్యూటీ ప్లాట్‌ఫారమ్ 'తిరా' కు అదనపు బలాన్ని ఇస్తుందని ఆమె పేర్కొన్నారు.భారతదేశాన్నే ఈ బ్రాండ్‌కు హబ్‌గా మార్చబోతున్నారు. భారత్‌తో పాటు ఉత్తర అమెరికా, యూకే, మధ్యప్రాచ్య దేశాల్లో కూడా అనామలీని విస్తరించేందుకు రిలయన్స్ ప్రణాళికలు సిద్ధం చేసింది. వినియోగదారుల టేస్ట్‌కు తగ్గట్లుగా మరిన్ని కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకురానున్నారు.

ప్రియాంక చోప్రా పాత్ర ఏమిటి?

బ్రాండ్‌ను రిలయన్స్‌కు విక్రయించినప్పటికీ, ప్రియాంక చోప్రా అనామలీతో తన బంధాన్ని తెంచుకోవడం లేదు. ఆమె ఈ బ్రాండ్‌కు క్రియేటివ్ డైరెక్టర్‌గా కొనసాగనున్నారు. ఉత్పత్తి రూపకల్పన, సరికొత్త ఐడియాలు, బ్రాండ్‌ను ముందుకు తీసుకెళ్లడంలో ఆమె కీలక పాత్ర పోషిస్తారు. అంటే.. రిలయన్స్ మార్కెటింగ్ పవర్, ప్రియాంక చోప్రా క్రియేటివిటీ కలిసి అనామలీని ఒక గ్లోబల్ పవర్‌హౌస్‌గా మార్చబోతున్నాయి. బ్యూటీ మార్కెట్‌లో ఇప్పటికే 'తిరా' ద్వారా నైకా, టాటా క్లిక్ వంటి సంస్థలకు గట్టి పోటీ ఇస్తున్న రిలయన్స్, ఇప్పుడు అనామలీ చేరికతో మరింత దూకుడు పెంచింది. మరి ఈ భాగస్వామ్యం బ్యూటీ లోకంలో ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.

Naresh.k

Naresh.k

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story