Recharge: పొరపాటున వేరే నెంబర్‌కు రీచార్జ్ చేశారా.? డబ్బులు వెనక్కి పొందే సింపుల్ చిట్కాలు ఇవే!

Recharge: మొబైల్ రీచార్జ్ చేసేటప్పుడు పొరపాటున వేరే నెంబర్‌కు రీచార్జ్ అయిందా? టెన్షన్ పడాల్సిన పనిలేదు.

Ravi
By Ravi
Published on: 24 July 2026 9:41 AM IST
Recharge
X

Recharge: పొరపాటున వేరే నెంబర్‌కు రీచార్జ్ చేశారా.? డబ్బులు వెనక్కి పొందే సింపుల్ చిట్కాలు ఇవే!

Recharge: మొబైల్ రీచార్జ్ చేసేటప్పుడు పొరపాటున వేరే నెంబర్‌కు రీచార్జ్ అయిందా? టెన్షన్ పడాల్సిన పనిలేదు. జియో, ఎయిర్‌టెల్, వీఐ యూజర్లు తమ డబ్బులను తిరిగి పొందడానికి కొన్ని సులభమైన పద్ధతులు ఉన్నాయి.

రోజూ మనం చేసే డిజిటల్ లావాదేవీలు లేదా మొబైల్ రీచార్జ్‌ల సమయంలో చిన్న పొరపాటు జరిగినా పెద్ద మొత్తంలో డబ్బు నష్టపోవాల్సి వస్తుంది. ముఖ్యంగా మొబైల్ నెంబర్ ఎంటర్ చేసేటప్పుడు డిజిట్ తప్పుగా పడితే, వేరే ఎవరికో రీచార్జ్ వెళ్తుంటుంది. ఇలాంటి పొరపాట్లు జరిగినప్పుడు చాలా మంది తమ డబ్బులు కోల్పోయామని ఆందోళన చెందుతుంటారు. అయితే టెలికాం ఆపరేటర్లు వినియోగదారుల సౌలభ్యం కోసం కొన్ని ప్రత్యేక వెసులుబాట్లను కల్పిస్తున్నాయి. పొరపాటున ఇతరులకు రీచార్జ్ చేస్తే ఆ డబ్బులను సులభంగా వెనక్కి పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. దీనికోసం కొన్ని నిర్దిష్టమైన నిబంధనలను, పద్ధతులను అనుసరించాల్సి ఉంటుంది.

జియో యూజర్లు ఒకవేళ తప్పు నెంబర్‌కు రీచార్జ్ చేస్తే, రీచార్జ్ చేసిన 3 గంటల్లోపు 'మైజియో' యాప్‌లోకి వెళ్లాలి. అక్కడ రీచార్జ్ హిస్టరీని ఓపెన్ చేసి ప్లాన్ క్యాన్సిల్ ఆప్షన్‌ను క్లిక్ చేయడం ద్వారా డబ్బులు రిఫండ్ పొందే అవకాశం ఉంటుంది. ఇక ఎయిర్‌టెల్ వినియోగదారులు 'ఎయిర్‌టెల్ థాంక్స్' యాప్‌లోని హెల్ప్ సెక్షన్‌కు వెళ్లాలి. అక్కడ 'రాంగ్ రీచార్జ్ రివర్సల్' ఆప్షన్ ద్వారా ఆ రీచార్జ్‌ను క్యాన్సిల్ చేయించుకోవచ్చని వెల్లడించారు. మరోవైపు వీఐ సిమ్‌కు సంబంధించి పొరపాటున వేరే నెంబర్‌కు రీచార్జ్ చేస్తే 51619 నెంబర్‌కు కాల్ చేసి కంప్లైంట్ రైజ్ చేయాలని సూచించారు. ఈ విధంగా ఫిర్యాదు చేయడం ద్వారా మీ డబ్బులు సురక్షితంగా వెనక్కి వచ్చేస్తాయి.

కాగా, డిజిటల్ రీచార్జ్‌లు చేసే సమయంలో ఎప్పుడైనా నెంబర్ సరిగ్గా ఉందా లేదా అని ఒకటికి రెండుసార్లు సరిచూసుకోవడం ఎంతో ఉత్తమం. అయినప్పటికీ అనుకోకుండా ఇలాంటి పొరపాటు జరిగితే వెంటనే స్పందించి సంబంధిత టెలికాం యాప్ లేదా కస్టమర్ కేర్ సేవలను ఆశ్రయించడం ద్వారా నష్టాన్ని నివారించవచ్చు.

Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.

Next Story