PPF: అకౌంట్‌లో డబ్బు వేయడం మర్చిపోయారా? మ‌ళ్లీ ఎలా యాక్టివ్ చేసుకోవాలి.?

PPF: పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) సురక్షితమైన పెట్టుబడి మార్గాల్లో ఒకటి. ప్రతి ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ.500 జమ చేయాలి అనే నిబంధన ఉంది.

Mokshith
Published on: 5 May 2026 3:02 PM IST
PPF
X

 PPF

PPF: పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) సురక్షితమైన పెట్టుబడి మార్గాల్లో ఒకటి. ప్రతి ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ.500 జమ చేయాలి అనే నిబంధన ఉంది. అయితే కొన్నిసార్లు ఈ చిన్న విషయం మర్చిపోతే అకౌంట్ ఇన్‌యాక్టివ్ అవుతుంది. తిరిగి ఈ అకౌంట్‌ను ఎలా యాక్టివేట్ చేసుకోవాలంటే..

PPF అకౌంట్ ఇన్‌యాక్టివ్ అవ్వడానికి కారణం

PPF ఖాతాలో ప్రతి ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ.500 జమ చేయకపోతే ఆ అకౌంట్ ఇన్‌యాక్టివ్‌గా మారుతుంది. చాలా మంది బిజీ జీవితంలో ఈ చిన్న మొత్తాన్ని జమ చేయడం మరిచిపోతారు. దీంతో ఖాతా తాత్కాలికంగా నిలిచిపోతుంది. కానీ ఇది శాశ్వత సమస్య కాదు, సరైన విధానంలో మళ్లీ యాక్టివ్ చేయవచ్చు.

ఇన్‌యాక్టివ్ అయిన తర్వాత ఏమి నష్టం?

అకౌంట్ ఇన్‌యాక్టివ్ అయిన తర్వాత కొన్ని ముఖ్యమైన ప్రయోజనాలు నిలిచిపోతాయి. ఉదాహరణకు, ఆ ఖాతా ఆధారంగా లోన్ తీసుకునే అవకాశం ఉండదు. అలాగే మధ్యలో డబ్బు తీసుకునే సౌకర్యం కూడా అందుబాటులో ఉండదు. ముఖ్యంగా, ఆ కాలానికి సంబంధించిన ఆదాయపన్ను మినహాయింపు (Section 80C) ప్రయోజనం కూడా కోల్పోతారు. అయితే మంచి విషయం ఏమిటంటే, మీ పెట్టుబడి మాత్రం పూర్తిగా సురక్షితంగా ఉంటుంది.

మళ్లీ యాక్టివ్ చేయడానికి ఎంత ఖ‌ర్చ‌వుతుంది.?

PPF అకౌంట్‌ను తిరిగి యాక్టివ్ చేయాలంటే ప్రతి మిస్ అయిన ఏడాదికి రూ.50 పీనాల్టీ చెల్లించాలి. అదేవిధంగా ప్రతి మిస్ అయిన సంవత్సరానికి కనీసంగా రూ.500 జమ చేయాలి. ఉదాహరణకు, రెండు సంవత్సరాల పాటు డబ్బు జమ చేయకపోతే మొత్తం రూ.100 పెనాల్టీతో పాటు రూ.1000 డిపాజిట్ చేయాలి. అంటే మొత్తం రూ.1100 చెల్లిస్తే అకౌంట్ మళ్లీ యాక్టివ్ అవుతుంది.

అకౌంట్‌ను ఎలా మళ్లీ యాక్టివ్ చేయాలి?

మీ PPF అకౌంట్ ఉన్న బ్యాంక్ లేదా పోస్టాఫీసుకు వెళ్లి రాతపూర్వకంగా అప్లికేషన్ ఇవ్వాలి. అక్కడి అధికారులు మీ ఖాతా స్థితిని పరిశీలించి, మీరు చెల్లించాల్సిన మొత్తం తెలియజేస్తారు. ఆ మొత్తం జమ చేసిన తర్వాత మీ అకౌంట్ మళ్లీ యాక్టివ్ అవుతుంది. కాబట్టి చిన్న పొరపాటు వల్ల మీ పెట్టుబడిని వదులుకోవాల్సిన అవసరం లేదు. సమయానికి చర్య తీసుకుంటే అన్ని ప్రయోజనాలను మళ్లీ పొందవచ్చు.

Mokshith

Mokshith

2015లో జ‌ర్న‌లిజం స్కూల్ ద్వారా నా కెరీర్‌ను ప్రారంభించాను. అనంత‌రం 2016 నుంచి ప‌లు మీడియా సంస్థ‌ల్లో ప‌నిచేశాను. మొద‌ట ప్రింట్ ఆ త‌ర్వాత డిజిట‌ల్‌లో క‌లిపి మొత్తం 10 ఏళ్ల అనుభ‌వం ఉంది. నేను ఎక్కువ‌గా లైఫ్‌స్టైల్‌, అంత‌ర్జాతీయం, టెక్నాల‌జీ, బిజినెస్‌, ఆస్ట్రాల‌జీకి సంబంధించి వార్త‌లు రాస్తుంటాను.

Next Story