Post Office: ఒక్క దెబ్బకు రెండు పిట్టలంటే ఇదే.. డబ్బు సేవింగ్‌తో పాటు ఇన్సూరెన్స్ ఇచ్చే బెస్ట్ ప్లాన్
Post Office: ఎలాంటి రిస్క్ లేకుండా, ప్రభుత్వ హామీతో పొదుపు చేయాలనుకునేవారికి పోస్టాఫీస్ అందిస్తున్న గ్రామ్ ప్రియా స్కీమ్ (Gram Priya Scheme) మంచి ఆప్షన్‌గా చెప్పవచ్చు.
Post Office: ఒక్క దెబ్బకు రెండు పిట్టలంటే ఇదే.. డబ్బు సేవింగ్‌తో పాటు ఇన్సూరెన్స్ ఇచ్చే బెస్ట్ ప్లాన్
Post Office: ఎలాంటి రిస్క్ లేకుండా, ప్రభుత్వ హామీతో పొదుపు చేయాలనుకునేవారికి పోస్టాఫీస్ అందిస్తున్న గ్రామ్ ప్రియా స్కీమ్ (Gram Priya Scheme) మంచి ఆప్షన్‌గా చెప్పవచ్చు. ఈ పథకం రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ (RPLI) పరిధిలో అమలవుతోంది. పొదుపుతో పాటు జీవిత బీమా ప్రయోజనాలను కూడా అందిస్తుంది.
రూ.7.25 లక్షలు ఎలా వస్తాయి?
గ్రామ్ ప్రియా స్కీమ్ కాలపరిమితి 10 సంవత్సరాలు. ఈ పథకంలో ప్రతి నెలా రూ.5,042 ప్రీమియం చెల్లిస్తే, 10 సంవత్సరాలు పూర్తయ్యే సమయానికి మొత్తం రూ.7.25 లక్షల వరకు ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది.
ఈ పథకంలో కనీస బీమా మొత్తం రూ.10,000 కాగా, గరిష్టంగా రూ.5 లక్షల వరకు బీమా తీసుకోవచ్చు. పోస్టాఫీస్ ప్రతి వెయ్యి రూపాయల బీమా మొత్తానికి ఏడాదికి రూ.45 చొప్పున బోనస్ అందిస్తుంది. రూ.5 లక్షల బీమాపై లెక్కిస్తే, ప్రతి ఏడాది రూ.22,500 బోనస్ లభిస్తుంది. పదేళ్లలో ఈ బోనస్ మొత్తం రూ.2.25 లక్షలకు చేరుతుంది. దీనికి బీమా మొత్తం కలిపి మొత్తం ప్రయోజనం రూ.7.25 లక్షల వరకు ఉంటుంది.
మధ్యలో కూడా డబ్బు పొందే సౌకర్యం
ఇది కేవలం మెచ్యూరిటీ సమయంలో మాత్రమే డబ్బు ఇచ్చే పథకం కాదు. ఇది మనీబ్యాక్ పాలసీ కావడంతో, పాలసీ కాలంలో నిర్ణీత వ్యవధిలో కొంత మొత్తాన్ని వాయిదాల రూపంలో అందిస్తారు. దీంతో కుటుంబ అవసరాలు, అత్యవసర ఖర్చులు, చిన్నపాటి ఆర్థిక అవసరాలను తీర్చుకోవడానికి ఉపయోగపడుతుంది. అందుకే ఈ స్కీమ్‌ను పొదుపు, బీమా రెండింటి కలయికగా భావిస్తారు.
పాలసీదారుడు మరణిస్తే కుటుంబానికి రక్షణ
గ్రామ్ ప్రియా స్కీమ్‌లో మరో ముఖ్యమైన ప్రయోజనం జీవిత బీమా రక్షణ. పాలసీ గడువు పూర్తికాకముందే పాలసీదారుడు మరణిస్తే, నామినీకి పూర్తి బీమా మొత్తాన్ని చెల్లిస్తారు. మిగిలిన ప్రీమియంలు చెల్లించాల్సిన అవసరం ఉండదు. అలాగే పాలసీ కాలం పూర్తయ్యే వరకు వేచి ఉండాల్సిన పనిలేదు. దీంతో కుటుంబానికి ఆర్థిక భరోసా లభిస్తుంది.
పెట్టుబడి పెట్టే ముందు తెలుసుకోవాల్సిన విషయాలు
గ్రామ్ ప్రియా స్కీమ్ పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో అమలవుతున్నందున మార్కెట్ ఒడిదుడుకుల ప్రభావం ఉండదు. అయితే ఇది 10 సంవత్సరాల దీర్ఘకాలిక పథకం కావడంతో ప్రతి నెలా ప్రీమియంను క్రమం తప్పకుండా చెల్లించాలి. ప్రీమియం చెల్లించడంలో ఆలస్యం లేదా నిర్లక్ష్యం జరిగితే పాలసీ ల్యాప్స్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే మెచ్యూరిటీకి ముందే డబ్బు తీసుకునే అవకాశాలు చాలా పరిమితంగా ఉంటాయి. అందువల్ల ఈ పథకంలో పెట్టుబడి పెట్టే ముందు మీ ఆర్థిక అవసరాలు, దీర్ఘకాలిక లక్ష్యాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోవడం మంచిది.




