PhonePe: ఫోన్‌పే వాడకపోతే మీ జేబుకు చిల్లు పడినట్టే..!
PhonePe: ఫోన్‌పే వాలెట్ వినియోగదారులకు కంపెనీ కీలక హెచ్చరిక జారీ చేసింది.
PhonePe: ఫోన్‌పే వాడకపోతే మీ జేబుకు చిల్లు పడినట్టే..!
PhonePe Wallet Alert: మీరు ఫోన్‌పే వాడుతున్నారా? అయితే ఈ ముఖ్యమైన వార్త మీ కోసమే. డిజిటల్ చెల్లింపుల రంగంలో అగ్రగామిగా ఉన్న ఫోన్‌పే, తన వాలెట్ వినియోగదారులకు కీలక హెచ్చరిక జారీ చేసింది. వరుసగా 365 రోజుల పాటు ఎలాంటి లావాదేవీలు జరపని వాలెట్ ఖాతాలపై జరిమానా విధించనున్నట్లు ప్రకటించింది. అసలు ఈ కొత్త నిబంధన ఏంటి? ఎవరికి వర్తిస్తుంది? ఈ ఛార్జీల బారిన పడకుండా ఉండాలంటే మీరు ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం.
ఫోన్‌పే తన తాజా పాలసీ అప్‌డేట్‌లో భాగంగా, నిష్క్రియంగా ఉన్న వాలెట్లపై త్రైమాసికానికి రూ. 100 మెయింటెనెన్స్ ఫీజు విధిస్తున్నట్లు ప్రకటించింది. ఒక యూజర్ తన ఫోన్‌పే వాలెట్ ద్వారా ఏడాది పాటు ఎలాంటి ఆర్థిక లావాదేవీలు చేయకపోతే, ఆ వాలెట్‌ను ‘ఇన్-యాక్టివ్’గా గుర్తిస్తారు. ప్లాట్‌ఫారమ్ భద్రతా ప్రమాణాలు, మెరుగుదలలను నిర్వహించడం కోసమే ఈ ఫీజును వసూలు చేస్తున్నామని కంపెనీ పేర్కొంది.
చాలామంది యూజర్లు కేవలం యాప్‌లోకి లాగిన్ అవ్వడం లేదా నేరుగా బ్యాంక్ ఖాతా ద్వారా యూపీఐ లావాదేవీలు చేయడం వల్ల తమ వాలెట్ యాక్టివ్‌గానే ఉందని భ్రమపడుతుంటారు. మీ బ్యాంక్ ఖాతా నుండి నేరుగా చేసే యూపీఐ పేమెంట్లు వాలెట్ యాక్టివిటీ కిందకు రావు. వాలెట్ యాక్టివ్‌గా ఉండాలంటే, ఖచ్చితంగా మీ వాలెట్ బ్యాలెన్స్ ఉపయోగించి ఏదైనా ఒక చిన్న లావాదేవీ చేయాల్సి ఉంటుంది.
మీ వాలెట్ ఇన్-యాక్టివ్ లిస్ట్‌లోకి వెళ్లేముందు కంపెనీ 15 రోజుల ముందే అలర్ట్ పంపుతుంది. ఆ సమయంలోగా మీరు ఏదైనా ఒక వాలెట్ ట్రాన్సాక్షన్ చేస్తే ఛార్జ్ పడదు. ఒకవేళ మీ నుంచి ఎలాంటి స్పందన లేకపోతే, మీ వాలెట్ బ్యాలెన్స్ నుంచి రూ. 100 ఆటోమేటిక్‌గా కట్ అవుతుంది. ఒకవేళ మీ వాలెట్‌లో రూ. 100 కంటే తక్కువ ఉంటే, ఆ ఉన్న మొత్తం మాత్రమే కట్ అయి వాలెట్ బ్యాలెన్స్ సున్నా అవుతుంది. దీనికోసం మీ బ్యాంక్ ఖాతా నుండి అదనంగా ఒక్క రూపాయి కూడా కట్ అవ్వదు. అలాగే మీ వాలెట్ బ్యాలెన్స్ మైనస్‌లోకి వెళ్లదు. మీ బ్యాంక్ ఖాతా పూర్తిగా సురక్షితం.
మీ డబ్బులు కట్ అవ్వకుండా ఉండటానికి ఈ సింపుల్ టిప్స్ పాటించండిడాది పూర్తికాకముందే మీ వాలెట్ బ్యాలెన్స్ ఉపయోగించి కనీసం ఒక రూపాయి రీఛార్జ్ లేదా బిల్ పేమెంట్ చేయండి. వాలెట్ మళ్లీ యాక్టివ్ అవుతుంది. మీకు అసలు ఫోన్‌పే వాలెట్‌తో పనే లేదు అనుకుంటే.. యాప్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి వాలెట్‌ను శాశ్వతంగా డిలీట్ చేసుకోండి. అలా క్లోజ్ చేసిన వెంటనే అందులో మిగిలి ఉన్న డబ్బు నేరుగా మీ బ్యాంక్ ఖాతాకు జమ అవుతుంది. ఫోన్‌పే నుండి వచ్చే SMSలు లేదా యాప్ నోటిఫికేషన్లను ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండండి.
ఈ రూల్ కేవలం ఫోన్‌పే వాలెట్ వాడేవారికి మాత్రమే. మీరు సాధారణంగా బ్యాంక్ అకౌంట్ ద్వారా చేసే UPI ట్రాన్సాక్షన్లు ఎప్పటిలాగే పూర్తిగా ఉచితం కాబట్టి కంగారు పడాల్సిన పనిలేదు. వెంటనే మీ ఫోన్‌పే యాప్ ఓపెన్ చేసి వాలెట్ హిస్టరీ, బ్యాలెన్స్ ఒకసారి చెక్ చేసుకోండి.




