Petrol Price Today : అక్కడ తగ్గుతోంది.. ఇక్కడ మాత్రం అంతే.. ఇవాళ్టి పెట్రోల్, డీజిల్ రేట్లు ఇవే..

Petrol Price Today : అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు తగ్గినప్పటికీ.. జూన్ 6న దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి.

CR Reddy
Published on: 6 Jun 2026 6:51 AM IST
Petrol Price Today
X

Petrol Price Today

Petrol Price Today : గ్లోబల్ మార్కెట్లో గత రెండు రోజులుగా ముడిచమురు ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 2.04 శాతం తగ్గి బ్యారెల్‌కు 93.09 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే డబ్ల్యూటీఐ క్రూడ్ ధర కూడా 2.69 శాతం తగ్గి 90.54 డాలర్లకు చేరుకుంది. అయినప్పటికీ, భారత ప్రభుత్వ రంగ చమురు సంస్థలు శనివారం (జూన్ 6, 2026) దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలలో ఎలాంటి మార్పులు చేయలేదు. దీంతో వాహనదారులకు ఆశించిన స్థాయిలో ఊరట లభించలేదు.

ఎన్నికల తర్వాత భారీగా పెరిగిన ధరలు

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే చమురు కంపెనీలు కేవలం 11 రోజుల వ్యవధిలోనే నాలుగు సార్లు ఇంధన ధరలను పెంచాయి. మే 15న మొదటిసారిగా పెట్రోల్‌పై రూ.3, డీజిల్‌పై రూ.3.29 పైసలు పెంచిన కంపెనీలు.. ఆ తర్వాత మే 19, మే 23, మే 25 తేదీల్లో వరుసగా రేట్లను వడ్డించాయి. ఇరాన్ యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు దాదాపు 50 శాతం పెరిగాయని, దీనివల్ల పెట్రోల్, డీజిల్, ఎల్‌పీజీ విక్రయాలపై తమకు రోజుకు సుమారు రూ.750 కోట్ల నష్టం వస్తోందని చమురు సంస్థలు పేర్కొంటున్నాయి.

హైదరాబాద్, ఇతర నగరాల్లో నేటి రేట్లు

ప్రస్తుతం దేశంలోని ప్రధాన నగరాల్లో ఇంధన ధరలు పరిశీలిస్తే.. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.115.73 వద్ద విక్రయించబడుతుండగా, డీజిల్ ధర లీటరుకు రూ.103.82 గా ఉంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ రూ.102.12, డీజిల్ రూ.95.20 గా ఉన్నాయి. ఆర్థిక రాజధాని ముంబైలో పెట్రోల్ ధర గరిష్టంగా రూ.111.21 కాగా, డీజిల్ ధర రూ.97.83 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. కోల్‌కతాలో పెట్రోల్ రూ.113.51, డీజిల్ రూ.99.82 గా ఉండగా, చెన్నైలో పెట్రోల్ రూ.107.77, డీజిల్ రూ.99.55 లీటర్ చొప్పున విక్రయించబడుతున్నాయి.

ఫోన్ ద్వారా లేటెస్ట్ రేట్లు తెలుసుకోండి ఇలా

దేశంలో ప్రతిరోజూ ఉదయం 6 గంటలకే పెట్రోల్, డీజిల్ కొత్త రేట్లు అప్‌డేట్ అవుతాయి. వినియోగదారులు తమ నగరంలోని ఖచ్చితమైన ధరలను కేవలం ఒక చిన్న ఎస్ఎంఎస్ ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు. ఇండియన్ ఆయిల్ కస్టమర్లు తమ మొబైల్ నుంచి 'RSP <స్పేస్> సిటీ కోడ్' టైప్ చేసి 9224992249 నంబర్‌కు మెసేజ్ పంపాలి. అలాగే బీపీసీఎల్ (BPCL) వినియోగదారులు 'RSP <స్పేస్> సిటీ కోడ్' అని రాసి 9223112222 నంబర్‌కు, హెచ్‌పీసీఎల్ (HPCL) కస్టమర్లు 'HPPRICE <స్పేస్> సిటీ కోడ్' అని టైప్ చేసి 9222201122 నంబర్‌కు ఎస్ఎంఎస్ పంపి తాజా రేట్లను తెలుసుకోవచ్చు.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story