Ola Shares: ఓలా ఎలక్ట్రిక్ షేర్ల ఊచకోత.. నెలలోనే 71% లాభం.. ఇన్వెస్టర్లకు పండగే..!
Ola Shares: ఓలా ఎలక్ట్రిక్ షేర్లలో భారీ మార్పు! గత ఆరు నెలలుగా నష్టాల్లో ఉన్న ఓలా స్టాక్, ఏప్రిల్ నెలలో ఏకంగా 71% పైగా పెరిగింది.
Ola Shares: ఓలా ఎలక్ట్రిక్ షేర్ల ఊచకోత.. నెలలోనే 71% లాభం.. ఇన్వెస్టర్లకు పండగే..!
Ola Electric Shares: ఒకప్పుడు ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్‌లో రారాజుగా వెలిగి, ఆ తర్వాత వరుస ఎదురుదెబ్బలతో కుదేలైన ఓలా ఎలక్ట్రిక్ మళ్ళీ ఫామ్‌లోకి వచ్చింది. గత ఆరు నెలలుగా నష్టాల ఊబిలో కూరుకుపోయిన ఈ షేరు, ఇప్పుడు రాకెట్‌లా దూసుకెళ్తోంది. కేవలం ఈ ఏప్రిల్ నెలలోనే 71 శాతం లాభపడి ఇన్వెస్టర్లకు బంపర్ ప్రాఫిట్స్ అందిస్తోంది.
నష్టాల నుంచి లాభాల ర్యాలీ వరకు..
గత ఏడాది కాలంగా ఓలా ఎలక్ట్రిక్ షేరు భారీ ఒడిదుడుకులను ఎదుర్కొంది. కస్టమర్ల అసంతృప్తి, సర్వీస్ సమస్యలు, పోటీ పెరగడం వంటి కారణాలతో షేరు ధర భారీగా పడిపోయి ఒకానొక దశలో రూ. 21.25 (52 వారాల కనిష్ఠం) వద్దకు చేరుకుంది. అయితే, ఈ ఏప్రిల్ నెలలో సీన్ రివర్స్ అయింది. ఇవాళ ఒక్కరోజే 12.55 శాతం జంప్ చేసి రూ. 40.90 వద్ద ముగిసింది.
పుంజుకోవడానికి ప్రధాన కారణాలు
మార్చి నెలలో కంపెనీ అమ్మకాలు ఊహించని రీతిలో పెరగడం ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని పెంచింది. కస్టమర్ల ఫిర్యాదులను సీరియస్‌గా తీసుకున్న కంపెనీ, సర్వీస్ సెంటర్ల నాణ్యతను పెంచడంపై దృష్టి సారించింది. బెంగళూరు కేంద్రంగా నడుస్తున్న ఫ్యూచర్ ఫ్యాక్టరీ ద్వారా సొంతంగా బ్యాటరీ ప్యాక్స్ తయారు చేయడం కంపెనీకి పెద్ద ప్లస్ పాయింట్‌గా మారింది. ఈవీ రంగంలో ఇతర కంపెనీల కంటే ముందుండేలా టెక్నాలజీపై ఓలా పెడుతున్న పెట్టుబడులు ఫలితాలను ఇస్తున్నాయి.
ఇన్వెస్టర్లు గమనించాల్సిన విషయాలు
ఓలా ఎలక్ట్రిక్ ప్రస్తుతం సుమారు రూ. 18,030 కోట్ల మార్కెట్ విలువను కలిగి ఉంది. గత వారం రోజుల్లోనే 35 శాతం మేర లాభపడినప్పటికీ, గత రెండేళ్ల కాలంలో ఈ స్టాక్ ఇంకా 57 శాతం నష్టంలోనే ఉంది. ప్రస్తుత ర్యాలీ ఇలాగే కొనసాగితే త్వరలోనే తన 52 వారాల గరిష్ఠ ధర అయిన రూ. 71.25 దిశగా అడుగులు వేసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.




