NPS: నెల‌కు రూ. 99 చెల్లిస్తే భ‌విష్య‌త్తులో భారీగా పెన్ష‌న్ పొందే అవ‌కాశం.. కేంద్రం కొత్త ప‌థ‌కం

NPS: డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో పనిచేసే గిగ్ వర్కర్లకు కేంద్ర ప్రభుత్వం కొత్త పెన్షన్ అవకాశాన్ని తీసుకొచ్చింది.

Mokshith
Published on: 17 Aug 2026 3:12 PM IST
NPS
X

NPS: నెల‌కు రూ. 99 చెల్లిస్తే భ‌విష్య‌త్తులో భారీగా పెన్ష‌న్ పొందే అవ‌కాశం.. కేంద్రం కొత్త ప‌థ‌కం

NPS: డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో పనిచేసే గిగ్ వర్కర్లకు కేంద్ర ప్రభుత్వం కొత్త పెన్షన్ అవకాశాన్ని తీసుకొచ్చింది. జాతీయ పింఛన్ వ్యవస్థ (NPS) కింద ప్రవేశపెట్టిన ఈ పథకం ద్వారా నెలకు కేవలం రూ.99తోనే పెట్టుబడిని ప్రారంభించవచ్చు.

ఎవరెవరు ఈ పథకంలో చేరవచ్చు?

స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్ వంటి ఫుడ్, గ్రోసరీ డెలివరీ సంస్థల్లో పనిచేసే డెలివరీ పార్ట్‌నర్లు, ఓలా, ఉబెర్, ర్యాపిడో డ్రైవర్లు, అర్బన్ కంపెనీ వంటి సేవల ప్లాట్‌ఫామ్‌లలో పనిచేసే గిగ్ వర్కర్లు ఈ పథకంలో నమోదు చేసుకోవచ్చు. డిజిటల్ అగ్రిగేటర్‌ల ద్వారా ఉపాధి పొందుతున్న వారికి ఈ పథకం అందుబాటులో ఉంటుంది.

రూ.99తో పెట్టుబడి.. గరిష్ట పరిమితి లేదు

ఈ పథకంలో కనీసంగా రూ.99తో సభ్యత్వాన్ని ప్రారంభించవచ్చు. ఆ తర్వాత ఆదాయం, అవసరానికి అనుగుణంగా ఎప్పుడైనా పెట్టుబడిని పెంచుకునే అవకాశం ఉంటుంది. గరిష్ట పెట్టుబడిపై ఎలాంటి పరిమితి లేదు. అలాగే సభ్యత్వం పొందేందుకు గరిష్ట వయోపరిమితిని కూడా నిర్ణయించలేదు. దీర్ఘకాలం క్రమం తప్పకుండా పెట్టుబడి పెడితే పదవీ విరమణ తర్వాత మంచి పెన్షన్ పొందే అవకాశం ఉంటుంది.

ఖాతా ఎలా తెరవాలి? ఏ ప్రయోజనాలు ఉంటాయి?

గిగ్ వర్కర్ల కోసం అందుబాటులో ఉన్న ఎన్‌పీఎస్ ఆప్షన్‌ను ఎంచుకుని పేరు, ఆధార్, పాన్, మొబైల్ నంబర్, బ్యాంక్ ఖాతా వివరాలతో కేవైసీ పూర్తి చేయాలి. నమోదు పూర్తైన తర్వాత పర్మనెంట్ రిటైర్మెంట్ అకౌంట్ నంబర్ (PRAN) జారీ అవుతుంది. తర్వాత అవసరమైన నామినీ, కుటుంబ వివరాలను సమర్పించాలి. ఉద్యోగం లేదా ప్లాట్‌ఫామ్ మారినా ఇదే ఖాతాను కొనసాగించవచ్చు.

పదవీ విరమణ వయస్సు చేరిన తర్వాత నిబంధనల ప్రకారం పెన్షన్ లేదా మొత్తాన్ని పొందే అవకాశం ఉంటుంది. పెట్టుబడులు ప్రభుత్వ బాండ్లు, ఈక్విటీ వంటి సాధనాల్లో పెట్టబడటంతో దీర్ఘకాలంలో మెరుగైన రాబడులు పొందే అవకాశం ఉంటుంది.

Mokshith

Mokshith

2015లో జ‌ర్న‌లిజం స్కూల్ ద్వారా నా కెరీర్‌ను ప్రారంభించాను. అనంత‌రం 2016 నుంచి ప‌లు మీడియా సంస్థ‌ల్లో ప‌నిచేశాను. మొద‌ట ప్రింట్ ఆ త‌ర్వాత డిజిట‌ల్‌లో క‌లిపి మొత్తం 10 ఏళ్ల అనుభ‌వం ఉంది. నేను ఎక్కువ‌గా లైఫ్‌స్టైల్‌, అంత‌ర్జాతీయం, టెక్నాల‌జీ, బిజినెస్‌, ఆస్ట్రాల‌జీకి సంబంధించి వార్త‌లు రాస్తుంటాను.

Next Story