UPI Payment: యూపీఐ చెల్లింపులపై కేంద్రం సంచలన ప్రకటన
UPI Payment: యూపీఐ చెల్లింపులపై ఎలాంటి రుసుములు ఉండవని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. P2P లావాదేవీలు ఉచితంగానే కొనసాగుతాయి.
UPI Payment: యూపీఐ చెల్లింపులపై కేంద్రం సంచలన ప్రకటన
UPI Payment Charges : మీరు రోజువారీ టీ కొట్టు వద్ద నుంచి పెద్ద షాపింగ్ మాల్స్ వరకు ఫోన్‌పే, గూగుల్ పేతో చేసే యూపీఐ చెల్లింపులపై ఛార్జీలు పడతాయనే వార్తలతో గందరగోళంలో ఉన్నారా? అయితే మీకు శుభవార్త. యూపీఐ చెల్లింపులపై వినియోగదారుల నుంచి ఎలాంటి రుసుములు వసూలు చేయబోమని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ శనివారం అధికారికంగా స్పష్టం చేసింది. వ్యక్తుల మధ్య జరిగే లావాదేవీలు సాధారణ షాపింగ్ చెల్లింపులు ఎప్పటిలాగే పూర్తిగా ఉచితంగానే కొనసాగుతాయి.
ఒకవేళ భవిష్యత్తులో మర్చంట్ డిస్కౌంట్ రేట్ అమల్లోకి వచ్చినా, అది కేవలం ఒక నిర్దిష్ట పరిమితి దాటిన పెద్ద వ్యాపార లావాదేవీలకు మాత్రమే వర్తిస్తుంది. క్రెడిట్, డెబిట్ కార్డులతో పోలిస్తే ఇది చాలా తక్కువగా ఉంటుంది. పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ యాక్ట్, 2007 సవరణల వల్ల అందరిపై ఛార్జీల మోత పడుతుందన్న వార్తలు ఒట్టి ఊహాగానాలేనని ప్రభుత్వం కొట్టిపారేసింది.
టాక్సేషన్ అండ్ అదర్ లాస్ బిల్, 2026కు పార్లమెంట్ ఆమోదం లభించిన తర్వాత మాత్రమే ఎన్పీసీఐ నేతృత్వంలోని కమిటీ ఎండీఆర్ పరిమితులపై తుది నిర్ణయం తీసుకుంటుంది.యూపీఐ వాడకం రోజురోజుకూ రికార్డు స్థాయిలో పెరుగుతోంది. జులై 2026 నాటికే ఏకంగా రూ. 29.9 లక్షల కోట్ల విలువైన 2,366 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. అంతేకాక, ప్రస్తుతం 11 దేశాల్లో మన యూపీఐ సేవలు అందుబాటులో ఉన్నాయి.
ఆన్లైన్ మోసాలను అరికట్టడం, వినియోగదారుల డేటాను సురక్షితంగా ఉంచడం. సర్వర్లు డౌన్ అవ్వకుండా సాంకేతికంగా మరింత బలోపేతం చేయడం. బ్యాంకులు, ఫిన్‌టెక్ సంస్థలు ప్రభుత్వ రాయితీలపైనే ఆధారపడకుండా వాటికి ఒక స్థిరమైన రాబడి నమూనాను అందించడం. ఏదేమైనా, మీ డిజిటల్ వ్యాలెట్ భద్రంగా ఉంది. ఎప్పటిలాగే రూపాయి కూడాదనపు ఖర్చు లేకుండా మీ ఫోన్ ద్వారా హ్యాపీగా చెల్లింపులు చేసుకోవచ్చు.




