రీఛార్జ్ ధరలు తగ్గనున్నాయి! ట్రాయ్ కొత్త నిబంధనలతో కస్టమర్లకు సూపర్ గుడ్ న్యూస్..

TRAI: మొబైల్ రీఛార్జ్ ధరలు తగ్గనున్నాయా? డేటా అవసరం లేకున్నా అనవసరంగా డబ్బులు ఖర్చు చేస్తున్నారా?

Ravi
By Ravi
Published on: 12 July 2026 1:34 PM IST
TRAI
X

రీఛార్జ్ ధరలు తగ్గనున్నాయి! ట్రాయ్ కొత్త నిబంధనలతో కస్టమర్లకు సూపర్ గుడ్ న్యూస్..

TRAI: మొబైల్ రీఛార్జ్ ధరలు తగ్గనున్నాయా? డేటా అవసరం లేకున్నా అనవసరంగా డబ్బులు ఖర్చు చేస్తున్నారా? ఇకపై మీ మొబైల్ బిల్లు 50 నుండి 70 శాతం వరకు తగ్గే అవకాశం ఉంది.

సాధారణంగా మనం మొబైల్ రీఛార్జ్ చేసేటప్పుడు ఒక సమస్యను ఎదుర్కొంటాం. మనకు కేవలం వాయిస్ కాల్స్ లేదా ఎస్ఎమ్ఎస్ మాత్రమే కావాల్సి ఉన్నా, ఎక్కువ వ్యాలిడిటీ కోసం డేటాతో కూడిన ఖరీదైన ప్లాన్లను తీసుకోవాల్సి వస్తోంది. ఈ సమస్యను గమనించిన టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా, కస్టమర్ల ప్రయోజనం కోసం ఒక కొత్త డ్రాఫ్ట్‌ను సిద్ధం చేసింది.

'డేటా అవసరం లేనప్పుడు, దాని కోసం ఎందుకు డబ్బులు చెల్లించాలి?' అనే ఆలోచనతో ట్రాయ్ ఈ కొత్త విధానాన్ని తీసుకువస్తోంది. ప్రస్తుతం టెలికాం కంపెనీలు వాయిస్, ఎస్ఎమ్ఎస్ ప్లాన్లను పరిమిత వ్యాలిడిటీతో మాత్రమే అందిస్తున్నాయి. దీనివల్ల కస్టమర్లు తమకు అవసరం లేకున్నా డేటా ప్లాన్లను కొనుగోలు చేయాల్సి వస్తోంది.

ట్రాయ్ ప్రతిపాదించిన ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వస్తే కస్టమర్లకు భారీ ప్రయోజనం చేకూరనుంది. స్టేక్ హోల్డర్ల అభ్యంతరాల పరిశీలన తర్వాత ఈ కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి.

ఈ కొత్త రూల్ ద్వారా రీఛార్జ్ ధరలు సుమారు 50 నుండి 70 శాతం వరకు తగ్గే అవకాశం ఉంది. ఈ నిర్ణయం అమలులోకి వస్తే, కస్టమర్లు తమకు నిజంగా అవసరమైన ప్లాన్లను మాత్రమే ఎంచుకుని, అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవచ్చు. డిజిటల్ వినియోగం పెరిగిన నేటి కాలంలో, ఇలాంటి వినియోగదారుల అనుకూల నిర్ణయాలు టెలికాం రంగంలో పెద్ద మార్పును తీసుకురానున్నాయి.

Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.

Next Story