ఎమర్జెన్సీ ఫండ్ దాచుకున్నారా.? ఆర్ధిక భద్రత కోసం ఈ 3-6-9 రూల్ కచ్చితంగా పాటించండి.!
Emergency Fund: ఆర్థిక కష్టాలు వచ్చినప్పుడు మనకు అండగా నిలిచేది ఎమర్జెన్సీ ఫండ్ మాత్రమే. అయితే, ఎవరు ఎంత ఎమర్జెన్సీ ఫండ్ దాచుకోవాలి అనే దానిపై ఆర్థిక నిపుణులు సూచిస్తున్న '3-6-9' రూల్ గురించి ఇక్కడ తెలుసుకోండి.
ఎమర్జెన్సీ ఫండ్ దాచుకున్నారా.? ఆర్ధిక భద్రత కోసం ఈ 3-6-9 రూల్ కచ్చితంగా పాటించండి.!
Emergency Fund: అనుకోని అనారోగ్య సమస్యలు, ప్రమాదాలు లేదా హఠాత్తుగా ఉద్యోగం పోవడం లాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు మనకు ఆర్థికంగా అండగా నిలిచేది 'ఎమర్జెన్సీ ఫండ్'. అందుకే సంపాదించే ప్రతి ఒక్కరూ తమ భవిష్యత్తు భద్రత కోసం కచ్చితంగా కొంత మొత్తాన్ని అత్యవసర నిధిగా పక్కన పెట్టాలని ఆర్థిక నిపుణులు తరచూ సూచిస్తుంటారు. అయితే, అసలు ఎవరు ఎంత ఎమర్జెన్సీ ఫండ్ దాచుకోవాలి అనే సందేహం చాలామందిలో ఉంటుంది. దీనికి పరిష్కారంగా ఆర్థిక నిపుణులు ఒక అద్భుతమైన '3-6-9' రూల్‌ను సూచిస్తున్నారు.
ఈ 3-6-9 రూల్ ప్రకారం ఎవరు తమ ఖర్చులకు సరిపడా ఎంత ఫండ్ దాచుకోవాలంటే:
3 నెలలకు సరిపడా: పెద్దగా అప్పులు లేని వారు, స్థిరమైన ఉద్యోగాలు చేస్తూ ఒంటరిగా ఉండే సింగిల్ ఉద్యోగులు కనీసం తమ 3 నెలల ఖర్చులకు సరిపడా మొత్తాన్ని ఎమర్జెన్సీ ఫండ్‌గా దాచుకోవాలి.
6 నెలలకు సరిపడా: భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగం చేస్తున్న వర్కింగ్ కపుల్స్, అలాగే పిల్లలు లేదా వృద్ధులైన తల్లిదండ్రులు తమపై ఆధారపడి ఉన్నవారు కనీసం 6 నెలలకు సరిపడా ఫండ్‌ను మెయింటైన్ చేయాలి.
9 నెలలకు సరిపడా: స్థిరమైన ఆదాయం లేని వారు, ఫ్రీలాన్సర్స్, కేవలం ఒక్కరి ఆదాయంపైనే మొత్తం కుటుంబం ఆధారపడే వ్యక్తులు తమ భవిష్యత్తు కోసం కనీసం 9 నెలలకు సరిపడా అత్యవసర నిధిని తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలి.
ఈ విధంగా ముందే ఒక ప్రణాళికతో ఎమర్జెన్సీ ఫండ్ దాచుకుంటే, భవిష్యత్తులో అకస్మాత్తుగా ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు వచ్చినా సులభంగా ఎదుర్కోవచ్చని నిపుణులు చెబుతున్నారు.




