Real Estate: దేశ వ్యాప్తంగా ఇళ్ల అమ్మకాలు డౌన్..హైదరాబాద్‌లో మాత్రం!

Real Estate: దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఇళ్ల విక్రయాలు 6 శాతం క్షీణించాయని ప్రాప్‌టైగర్ నివేదిక వెల్లడించింది.

Gagan kumar
Published on: 23 Aug 2026 11:16 AM IST
Real Estate
X

Real Estate: దేశ వ్యాప్తంగా ఇళ్ల అమ్మకాలు డౌన్..హైదరాబాద్‌లో మాత్రం!

Real Estate: దేశంలోని ప్రధాన నగరాల్లో స్థిరాస్తి మార్కెట్ మందగమనాన్ని ఎదుర్కొంటోంది. ఈ ఏడాది ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో దేశవ్యాప్తంగా అగ్రగామి ఎనిమిది ప్రధాన నగరాల్లో ఇళ్ల విక్రయాలు 6 శాతం క్షీణించి 91,729 యూనిట్లకు పడిపోయాయని ప్రముఖ రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ సంస్థ ప్రాప్‌టైగర్ తన రియల్ ఇన్‌సైట్ నివేదికలో వెల్లడించింది. గతేడాది ఇదే సమయంలో 97,674 యూనిట్ల అమ్మకాలు జరిగాయి.

పశ్చిమాసియా ప్రాంతంలో చోటుచేసుకున్న భౌగోళిక-రాజకీయ ఘర్షణలు, యుద్ధ భయాలు.కృత్రిమ మే వేగంగా విస్తరిస్తుండటంతో ఉద్యోగ భద్రతపై ఏర్పడిన ఆందోళనల కారణంగా కొనుగోలుదారులు ఆచితూచి అడుగులు వేస్తున్నారు.

ముంబై, ఢిల్లీ-ఎన్‌సీఆర్, బెంగళూరు, పుణే, కోల్‌కతా, అహ్మదాబాద్‌లలో నివాస గృహాల అమ్మకాలు గణనీయంగా పడిపోయాయి. దేశవ్యాప్తంగా మార్కెట్ మందగించినప్పటికీ దక్షిణ భారతదేశంలోని రెండు ప్రధాన నగరాలు మాత్రం బలమైన వృద్ధిని కనబరిచాయి. చెన్నైలో అత్యధికంగా 36 శాతం వృద్ధితో 7,183 యూనిట్ల విక్రయాలను సాధించింది. హైదరాబాద్‌లో 15 శాతం వృద్ధిని నమోదు చేస్తూ జూన్ త్రైమాసికంలో ఏకంగా 13,196 యూనిట్ల అమ్మకాలతో దూసుకుపోయింది.

ఒకవైపు అమ్మకాలు నెమ్మదించినప్పటికీ, డెవలపర్లు కొత్త ప్రాజెక్ట్‌లను విస్తృతంగా మార్కెట్లోకి తీసుకొచ్చారు. కొత్త ఇళ్ల సరఫరా 6 శాతం పెరిగి 89,161 యూనిట్లకు చేరింది. ఇక చదరపు అడుగు సగటు ధర వరుసగా రెండు త్రైమాసికాలుగా రూ.10,000 పైనే స్థిరంగా కొనసాగుతోందని ప్రాప్‌టైగర్ నివేదిక పేర్కొంది.

మార్కెట్ బలహీనపడటం లేదని, కొనుగోలుదారులు నాణ్యమైన ఇళ్లను ఎంచుకునే దిశగా పరిపక్వత సాధిస్తున్నారని, రాబోయే పండుగల సీజన్‌లో రియల్ ఎస్టేట్ రంగానికి మళ్లీ మంచి రోజులు వస్తాయని నిపుణులు భావిస్తున్నారు.

Gagan kumar

Gagan kumar

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story