N Chandrasekaran: టాటా సన్స్‌ ఛైర్మన్‌ పదవికి చంద్రశేఖరన్‌ రాజీనామా!

N Chandrasekaran: టాటా గ్రూప్ మాతృ సంస్థ 'టాటా సన్స్' (Tata Sons) ఛైర్మన్ పదవి నుంచి ఎన్. చంద్రశేఖరన్ వైదొలిగారు.

Arun Chilukuri
Published on: 12 Aug 2026 12:14 PM IST
N Chandrasekaran
X

N Chandrasekaran: టాటా సన్స్‌ ఛైర్మన్‌ పదవికి చంద్రశేఖరన్‌ రాజీనామా!

N Chandrasekaran: టాటా గ్రూప్ మాతృ సంస్థ 'టాటా సన్స్' ఛైర్మన్ పదవి నుంచి ఎన్. చంద్రశేఖరన్ వైదొలిగారు. ఆగస్టు 18న కంపెనీ వార్షిక సర్వసభ్య సమావేశం (AGM) జరగనున్న నేపథ్యంలో ఆయన తన నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుత పదవీకాలం 2027 ఫిబ్రవరి 20తో ముగియనుండగా.. ఆ తర్వాత తాను మళ్లీ ఆ పదవికి పోటీ పడబోనని స్పష్టం చేశారు.

ప్రస్తుతం తన రెండవ విడత పదవీకాలాన్ని కొనసాగిస్తున్న చంద్రశేఖరన్, 2027 ఫిబ్రవరి వరకు మాత్రమే ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తారు. కొత్త నాయకత్వ ఎంపిక, సజావుగా అధికార మార్పిడి జరిగేలా బోర్డు వెంటనే తగిన నిర్ణయం తీసుకోవాలని కోరారు.

టాటా గ్రూప్‌లో 40 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నానని, గడిచిన పదేళ్లుగా టాటా సన్స్‌ను నడిపించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని చంద్రశేఖరన్ పేర్కొన్నారు. తన పదవీకాలాన్ని మరో ఐదేళ్లు పొడిగించేందుకు టాటా ట్రస్ట్‌లు గతంలో ఏకగ్రీవంగా రికమండ్ చేసినప్పటికీ, ఈ ఏడాది ఫిబ్రవరి 24న జరిగిన బోర్డు సమావేశంలో ఒక డైరెక్టర్ మద్దతు ఇవ్వకపోవడంతో ఆ తీర్మానం వాయిదా పడింది. ఆరు నెలలైనా స్పష్టత రాకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

టాటా గ్రూప్‌లో అనేక కీలక ప్రాజెక్టులు కొనసాగుతున్నందున, ఉద్యోగులు మరియు పెట్టుబడిదారులలో స్పష్టత కోసం కొత్త నాయకుడిని ముందుగానే ఎన్నుకోవడం అవసరమని సూచించారు. 2017లో టాటా సన్స్‌ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన చంద్రశేఖరన్ హయాంలో ఎయిర్ ఇండియా కొనుగోలు, ఏవియేషన్ రంగా విస్తరణ, సెమీకండక్టర్ తయారీ సహా ఎలక్ట్రానిక్స్ రంగాల్లో టాటా గ్రూప్ విపరీతమైన అభివృద్ధిని సాధించింది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story