MS Dhoni: ధోని గోల్డెన్ ఇన్నింగ్స్.. రిటైరైనా చెరగని ఆదరణ
MS Dhoni: మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ నూతన బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంఎస్ ధోని నియామకం.
MS Dhoni: ధోని గోల్డెన్ ఇన్నింగ్స్.. రిటైరైనా చెరగని ఆదరణ
Malabar Gold & Diamonds: మైదానంలో హెలికాప్టర్ షాట్లతో ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించినా.. కష్టసమయాల్లో జట్టును విజయతీరాలకు చేర్చినా.. అది ఒక్క మహేంద్రసింగ్ ధోనికే చెల్లింది. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికి ఏళ్లు గడుస్తున్నా, కెప్టెన్ కూల్ క్రేజ్, బ్రాండ్ వ్యాల్యూ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. వయసు పెరుగుతున్న కొద్దీ మైదానంలో ధోని ఆట పట్ల అభిమానం ఎలా పెరుగుతుందో.. కార్పొరేట్ మార్కెట్‌లో ఆయన బ్రాండ్ ఇమేజ్ కూడా అంతే రీతిలో దూసుకెళ్తోంది. ఈ క్రమంలోనే ప్రముఖ అంతర్జాతీయ ఆభరణాల సంస్థ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ తమ నూతన బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంఎస్ ధోనిని నియమించుకున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
ముంబైలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో మలబార్ గోల్డ్ ఈ సంచలన ఒప్పందాన్ని వెల్లడించింది. సంస్థ పాటిస్తున్న బాధ్యతాయుతమైన జ్యువెలరీ అనే ఫిలాసఫీని ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లడానికే ధోనిని ఎంచుకున్నట్లు పేర్కొంది. మలబార్ గోల్డ్ ప్రతినిధులు మాట్లాడుతూ..నేటి కస్టమర్లు ఆభరణాలు కొనుగోలు చేసేటప్పుడు పారదర్శకత, విశ్వసనీయతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. మైదానంలో తన నిజాయితీ, నిబద్ధతతో కోట్ల మంది హృదయాలను గెలుచుకున్న ధోని.. మలబార్ గోల్డ్ విలవలకు సరిగ్గా సరిపోతారని తెలిపారు.
మలబార్ గోల్డ్‌తో కొత్త ప్రయాణం ప్రారంభించడంపై ధోని తనదైన శైలిలో స్పందించారు. నమ్మకం అనేది ఊరికే రాదు.. మనం మాట్లాడే మాటలు, చేసే పనుల ద్వారానే దాన్ని సంపాదించుకోవాలి.వ్యాపారంలో పారదర్శకత, సామాజిక బాధ్యత పట్ల మలబార్ గోల్డ్ చూపిస్తున్న నిబద్ధత నన్ను ఎంతగానో ఆకట్టుకుంది.విలువలకు విలువ ఇచ్చే ఇలాంటి బాధ్యతాయుతమైన బ్రాండ్‌తో కలిసి పని చేయడం చాలా సంతోషంగా ఉందని ధోని చెప్పుకొచ్చారు.
రిటైర్మెంట్ తర్వాత సాధారణంగా క్రీడాకారుల బ్రాండ్ విలువ తగ్గుతుంటుంది. కానీ, ధోని విషయంలో లెక్కలు వేరు. ఆయనను నేటికీ ప్రకటనల ప్రపంచంలో అత్యంత డిమాండ్ ఉన్న లీడర్‌గా నిలబెడుతున్నాయి. మలబార్ గోల్డ్ లాంటి దిగ్గజ సంస్థ ధోనితో చేతులు కలపడం.. ఆయన చెరగని బ్రాండ్ ఇమేజ్‌కు సరికొత్త నిదర్శనంగా మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.




