LPG Gas E-KYC Deadline: గ్యాస్ వినియోగదారులకు అలర్ట్.. ఈ-కేవైసీ పూర్తి చేయడానికి నేడే తుది గడువు!
LPG Gas E-KYC Deadline: గ్యాస్ కనెక్షన్ ఉన్నవారికి ఈ-కేవైసీ పూర్తి చేయడానికి నేటితో (ఆగస్టు 31, 2026) తుది గడువు ముగియనుంది.
LPG Gas E-KYC Deadline: గ్యాస్ వినియోగదారులకు అలర్ట్.. ఈ-కేవైసీ పూర్తి చేయడానికి నేడే తుది గడువు!
LPG Gas E-KYC Deadline: దేశంలోని గ్యాస్ కనెక్షన్ కలిగిన వినియోగదారులకు 'ఈ-కేవైసీ' ప్రక్రియ అత్యంత కీలకంగా మారింది. ఇండియన్ ఆయిల్, భారత్ గ్యాస్, హెచ్‌పీ గ్యాస్ వినియోగదారులు ఆధార్ ఆధారిత ముఖ గుర్తింపు ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంది. గతంలో ప్రకటించిన ఆగస్టు 16 గడువును పొడిగించగా, నేటితో (2026 ఆగస్టు 31) తుది గడువు ముగియనుంది. అయితే ఈ నిబంధన గతంలో ఈ-కేవైసీ పూర్తి చేయని నాన్-పీఎంయూవై వినియోగదారులకు వర్తిస్తుంది.
"గడువులోగా ఈ-కేవైసీ పూర్తి చేయని వారికి గ్యాస్ సేవల్లో ఇబ్బందులు ఎదురుకావడమే కాకుండా, కనెక్షన్ తాత్కాలికంగా నిలిపివేయబడే అవకాశం ఉంది."
ఇప్పటివరకు ఈ-కేవైసీ పూర్తి చేయని నాన్-పీఎంయూవై వినియోగదారులందరూ ఈ ప్రక్రియను తప్పనిసరిగా పూర్తి చేయాలి. ఇప్పటికే పూర్తి చేసినవారు మళ్లీ చేయాల్సిన అవసరం లేదు.
గడువులోగా పూర్తి చేయని వారి గ్యాస్ కనెక్షన్‌ను తాత్కాలికంగా నిలిపివేయవచ్చు. అయితే కనెక్షన్ శాశ్వతంగా రద్దు చేయబడదు, ఈ-కేవైసీ పూర్తి చేసిన తర్వాత కనెక్షన్‌ను తిరిగి యాక్టివేట్ చేస్తారు.
ఈ ప్రక్రియ పూర్తి చేయకపోతే సబ్సిడీ లేదా దేశీయ ధరకు గ్యాస్ సిలిండర్ పొందడంలో ఇబ్బందులు ఎదురుకావచ్చని, కొన్ని నివేదికల ప్రకారం వాణిజ్య ధర చెల్లించాల్సి రావొచ్చని ఇండియన్ ఆయిల్ తెలిపింది.
ఇంట్లో నుంచే ఈ-కేవైసీ పూర్తి చేసే విధానం:
వినియోగదారులు ఎక్కడికీ వెళ్లకుండా మొబైల్ యాప్‌ల ద్వారా సులభంగా ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు:
ఇండేన్ గ్యాస్: 'ఇండియన్‌ఆయిల్ వన్' (Indane Oil One) యాప్ ఉపయోగించాలి.
భారత్ గ్యాస్: 'హలో బీపీసీఎల్' (Hello BPCL) యాప్ ఉపయోగించాలి.
హెచ్‌పీ గ్యాస్: 'హెచ్‌పీ పే' (HP Pay) యాప్‌ను ఉపయోగించవచ్చు.
ఆధార్ ముఖ గుర్తింపు కోసం ఫోన్‌లో 'ఆధార్‌ఫేస్ ఆర్‌డీ' యాప్ కూడా ఉండాలి. యాప్‌లో రిజిస్ట్రేషన్ పూర్తి చేసిన తర్వాత ఈ-కేవైసీ ఆప్షన్ ఎంచుకుని ముఖ స్కాన్ ద్వారా ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయవచ్చు.




