Jio: 365GB డేటా, ఫ్రీగా 15 OTTలు.. జియో బంపర్ ఆఫర్ మాములుగా లేదుగా..

Jio: దేశంలోనే అతిపెద్ద టెలికాం రిలయన్స్ జియో తన సబ్ స్రైబర్ల కోసం మూడు సరికొత్త, అద్భుతమైన ప్రిపేడ్ ప్లాన్లను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది.

Venkat
Published on: 12 Aug 2026 6:06 PM IST
Jio
X

Jio: 365GB డేటా, ఫ్రీగా 15 OTTలు.. జియో బంపర్ ఆఫర్ మాములుగా లేదుగా..

Jio: దేశంలోనే అతిపెద్ద టెలికాం రిలయన్స్ జియో తన సబ్ స్రైబర్ల కోసం మూడు సరికొత్త, అద్భుతమైన ప్రిపేడ్ ప్లాన్లను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. ఎక్కువ ఇంటర్నెట్ డేటా, ఎంటర్‌టైన్‌మెంట్ కోరుకునే యూజర్లను లక్ష్యంగా చేసుకుని ఈ ప్లాన్లను రూపొందించారు. కేవలం రూ.200 ప్రారంభ ధరతో అందుబాటులోకి వచ్చిన ఈ ఆఫర్లలో 28 రోజుల నుంచి ఏకంగా 365 రోజుల వరకు చెల్లుబాటు ఉండే సదుపాయం కల్పించారు. ఇప్పటికే మీ నంబర్‌పై ఏదైనా రీఛార్జ్ ప్లాన్ యాక్టివ్‌గా ఉన్నప్పటికీ, అదనపు డేటా, ఓటీటీ ప్రయోజనాల కోసం వీటిని రీఛార్జ్ చేసుకోవచ్చు.

జియో రూ.2000 ప్లాన్ వివరాలు (365 రోజుల వాలిడిటీ)..

జియో తీసుకొచ్చిన అత్యంత ప్రీమియం ప్లాన్ రూ.2000 తో లభిస్తుంది. ఈ ప్లాన్ చెల్లుబాటు ఏకంగా 365 రోజులు. ఇందులో యూజర్లకు మొత్తం 365GB హై-స్పీడ్ డేటాతో పాటు అపరిమిత 5G డేటా లభిస్తుంది. దీంతో పాటు 1000కి పైగా లైవ్ టీవీ ఛానెళ్లను ఉచితంగా వీక్షించవచ్చు. అంతేకాకుండా యూట్యూబ్ ప్రీమియం, జియో హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ లైట్, సోనీ లివ్, జీ5, డిస్కవరీ+, సన్ నెక్స్ట్, ఈటీవీ విన్ సహా 15 ప్రముఖ ఓటీటీ యాప్‌లకు ఉచిత యాక్సెస్ లభిస్తుంది.

జియో రూ.200 ప్లాన్ వివరాలు (28 రోజుల వాలిడిటీ)..

చౌకైన ధరలో ఓటీటీ, డేటా కోరుకునే వారి కోసం రూ.200 ప్లాన్‌ను జియో అందించింది. ఈ ప్లాన్ వాలిడిటీ 28 రోజులు. ఇందులో మొత్తం 30GB డేటా లభిస్తుంది. దీని ద్వారా కూడా 15 ఉచిత ఓటీటీ యాప్స్ యాక్సెస్, ఫ్రీ లైవ్ టీవీ ఛానెళ్లను ఆస్వాదించవచ్చు. దీనికి అదనంగా సినెపోలిస్ ఆఫర్ కింద చౌకగా మూవీ టికెట్లు పొందే అవకాశం కూడా కల్పిస్తున్నారు.

జియో రూ.550 ప్లాన్ వివరాలు (84 రోజుల వాలిడిటీ)..

మీడియం కాలపరిమితి కోరుకునే వినియోగదారుల కోసం రూ.550 ప్లాన్ అందుబాటులో ఉంది. దీని చెల్లుబాటు కాలం 84 రోజులు. ఈ ప్లాన్‌లో కస్టమర్లకు మొత్తం 90GB డేటా లభిస్తుంది. ఇందులో కూడా 1000కి పైగా ఉచిత లైవ్ టీవీ ఛానెళ్లు, 15 ప్రముఖ ఓటీటీ యాప్స్ ఉచిత సబ్‌స్క్రిప్షన్ సౌకర్యం ఉంటుంది.

Venkat

Venkat

2013లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌, పలు పత్రికల్లో 13 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాస్తుంటాను. స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాస్తుంటాను.

Next Story