Investment: కోటి రూపాయలు సంపాదించాలంటే నెలకు ఎంత SIP చేయాలో తెలుసా ?
Investment: కోటి రూపాయలు సంపాదించడం అనేది చాలా మంది కల. ఇందుకోసం ఒక్కొక్కరు ఒక్కో మార్గాన్ని ఎంచుకుంటారు.
Investment: కోటి రూపాయలు సంపాదించాలంటే నెలకు ఎంత SIP చేయాలో తెలుసా.?
Investment: కోటి రూపాయలు సంపాదించడం అనేది చాలా మంది కల. ఇందుకోసం ఒక్కొక్కరు ఒక్కో మార్గాన్ని ఎంచుకుంటారు. ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్‌లలో SIP (సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్) ద్వారా క్రమం తప్పకుండా పెట్టుబడి పెడితే దీర్ఘకాలంలో భారీ సంపదను సృష్టించుకోవచ్చని ఆర్థిక నిపుణులు చెబుతుంటారు. మరి కోటి కూడబెట్టాలంటే నెలకు ఎంత SIP చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.?
మీరు ప్రతి నెల రూ.10,000 చొప్పున SIP చేస్తూ వెళ్తే.. ఏడాదికి 12 శాతం రాబడి వస్తుందని అంచనా వేస్తే. సుమారు 21 ఏళ్లలో కోటి రూపాయలకు పైగా ఫండ్‌ను సృష్టించవచ్చు. ఈ లెక్కన చూసుకుంటే నిర్ణీత 21 ఏళ్లలో మీరు మొత్తం పెట్టుబడి పెట్టేది రూ. 25.20 లక్షలు మాత్రమే అవుతుంది. అయితే కాంపౌండ్ ఇంట్రెస్ట్ వల్ల రూ.79 లక్షలకు పైగా లాభం పొందుతారు. దీంతో మీ మొత్తం ఫండ్ విలువ రూ. 1.04 కోట్లకు చేరుతుంది. ఒకవేళ నెలకు రూ. 15 వేల చొప్పున పెట్టుబడి పెడుతూ వెళ్తే.. 18 ఏళ్లలోనే రూ. 1.06 కోట్లకు పైగా ఫండ్ ఏర్పడే అవకాశం ఉంటుంది.
స్టెప్ అప్ SIP అంటే ఏంటి.?
సాధారణంగా ప్రతీ ఏటా ఉద్యోగులకు జీతం పెరుగుతుంది. పెరిగిన ఈ జీతంతో ఎస్ఐపీ మొత్తాన్ని పెంచుతూ వెళ్లాలి. దీనినే స్టెప్ అప్ ఎస్ఐపీ అంటారు. ఉదాహరణకు మీరు రెండో ఏడాది 5 శాతం SIP మొత్తాన్ని పెంచారని అనుకుందాం. ఆ లెక్కన నెలకు రూ. 5 వేలు పెంచుతూ వెళ్లాలి. ఇలా చేస్తూ వెళ్తే భారీ మొత్తంలో రిటర్న్స్ పొందొచ్చు.
15 ఏళ్లలోనే కోటీశ్వరులు అవ్వొచ్చు.
స్టెప్ అప్ ఎస్ఐపీ ద్వారా 15 ఏళ్లలోనే కోటీశ్వరులు అవ్వొచ్చని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. రూ. 10 వేల ఎస్ఐపీపై 10 శాతం పెంచుతూ పోతే 117 ఏళ్లలోనే రూ. 1.15 కోట్ల ఫండ్ అవుతుంది. అదే విధంగా ఒకవేళ 15 శాతం చొప్పున ఎస్ఐపీని పెంచితే 15 ఏళ్లలోనే రూ. 1.13 కోట్లకుపైగా ఫండ్‌ను సొంతం చేసుకోవచ్చు.
స్టెప్-అప్ SIPతో ముఖ్యమైన ప్రయోజనం ఇదే..
స్టెప్-అప్ SIP వల్ల చక్రవడ్డీ ప్రభావం ఎక్కువగా పనిచేస్తుంది. అదే విధంగా పెరిగే ద్రవ్యోల్బాన్ని దృష్టిలో పెట్టుకున్నా స్టెప్ అప్ ఎస్ఐపీ అనేది బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు. పిల్లల ఉన్నత విద్యకు, వివాహానికి, సొంతింటి నిర్మాణానికి ప్లాన్ చేసే వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. జీతం పెరిగిన సమయంలో ఖర్చులకు కాకుండా పెట్టుబడిగా మార్చుకోగలిగితే తక్కువ సమయంలో మీ ఆర్థిక లక్ష్యాన్ని చేరుకోగలరని చెప్పడానికి SIP ఒక మంచి ఉదాహరణగా చెప్పొచ్చు.
గుర్తుంచుకోవాల్సిన విషయాలు
ఇదిలా ఉంటే మ్యూచువల్ ఫండ్‌లో లాభాలు అనేవి మార్కెట్ రిస్క్‌పై ఆధారపడి ఉంటాయి. అందువల్ల కచ్చితంగా 12 శాతం రాబడి వస్తుందన్న గ్యారెంటీ ఉండదు. అందుకే స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టే ముందు ఆర్థిక నిపుణుల సూచనలు పాటించడం ఉత్తమం.




