Indian Railway: ఈ చిన్న తప్పుతో మీ కన్ఫర్మ్ టికెట్ కూడా క్యాన్సిల్ అవుతుంది.. రైల్వే రూల్స్ తెలుసుకోవాల్సిందే
Indian Railway: ప్రతిరోజూ లక్షలాది మంది భారతీయ రైల్వేల్లో ప్రయాణిస్తున్నారు. టికెట్ కన్ఫర్మ్ అయితే సీటు పూర్తిగా సేఫ్ అనుకుంటారు.
Indian Railway: ఈ చిన్న తప్పుతో మీ కన్ఫర్మ్ టికెట్ కూడా క్యాన్సిల్ అవుతుంది.. రైల్వే రూల్స్ తెలుసుకోవాల్సిందే
Indian Railway: ప్రతిరోజూ లక్షలాది మంది భారతీయ రైల్వేల్లో ప్రయాణిస్తున్నారు. టికెట్ కన్ఫర్మ్ అయితే సీటు పూర్తిగా సేఫ్ అనుకుంటారు. కానీ చాలామందికి తెలియని ఒక ముఖ్యమైన రూల్ కారణంగా కన్ఫర్మ్ టికెట్ ఉన్నా సీటు కోల్పోయే పరిస్థితి వస్తుంది. ఆ తప్పులేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
బోర్డింగ్ స్టేషన్ నుంచి ఎక్కకపోతే ఏమవుతుంది?
రైల్వే నిబంధనల ప్రకారం ప్రయాణికుడు టికెట్‌లో పేర్కొన్న స్టేషన్‌లో రైలెక్కకపోతే TTE ఆ ప్రయాణికుడిని “No Show”గా గుర్తించవచ్చు. ప్రయాణికుడు తర్వాతి రెండు స్టేషన్ల వరకు కూడా సీటులో కనిపించకపోతే ఆ సీటును ఖాళీగా పరిగణిస్తారు. అలాంటి సమయంలో వెయిటింగ్ లిస్టులో ఉన్న ప్రయాణికుడికి లేదా అత్యవసరంగా ప్రయాణించాల్సిన మరో వ్యక్తికి ఆ సీటును TTE కేటాయించే అధికారం ఉంటుంది. దీంతో మీ దగ్గర కన్ఫర్మ్ టికెట్ ఉన్నా సీటుపై హక్కు కోల్పోయే అవకాశం ఉంటుంది.
టికెట్ పూర్తిగా రద్దవుతుందా?
ఈ పరిస్థితిలో టికెట్ పూర్తిగా క్యాన్సిల్ కాదు. కానీ మీకు కేటాయించిన సీటు మాత్రం ఇక మీ కోసం రిజర్వ్‌గా ఉండదు. చాలా మంది తర్వాతి స్టేషన్‌లో ఎక్కినా సరిపోతుందని అనుకుంటారు. కానీ ముందుగా రైల్వేలకు సమాచారం ఇవ్వకపోతే ఇబ్బందులు రావచ్చు.
ఒకసారి TTE ఆ సీటును మరొకరికి ఇచ్చిన తర్వాత తిరిగి ఆ సీటును క్లెయిమ్ చేయడం సాధ్యం కాకపోవచ్చు. అందుకే ప్రయాణికులు బోర్డింగ్ పాయింట్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని రైల్వే అధికారులు సూచిస్తున్నారు.
బోర్డింగ్ స్టేషన్ మార్చుకునే అవకాశం ఉంది
భారతీయ రైల్వేలు ప్రయాణికులకు బోర్డింగ్ స్టేషన్ మార్చుకునే సదుపాయం కల్పిస్తున్నాయి. రైలు బయలుదేరే సమయానికి కనీసం 30 నిమిషాల ముందు వరకు ఈ మార్పు చేసుకోవచ్చు. IRCTC వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా ఆన్‌లైన్‌లో బోర్డింగ్ పాయింట్ మార్చుకోవచ్చు. అలాగే రైల్వే రిజర్వేషన్ కౌంటర్లలో కూడా ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. కొన్ని సందర్భాల్లో చార్ట్ సిద్ధమైన తర్వాత కూడా మార్పు చేసే అవకాశం ఉండొచ్చు. అయితే అది ప్రతి సారి సాధ్యం కాకపోవచ్చు.
ప్రయాణానికి ముందు తప్పక గుర్తుంచుకోవాల్సిన విషయాలు
ప్రయాణం చేసే ముందు టికెట్‌లో ఉన్న బోర్డింగ్ స్టేషన్‌ను ఒకసారి చెక్ చేసుకోవాలి. వేరే స్టేషన్ నుంచి ఎక్కాల్సి వస్తే ముందుగానే బోర్డింగ్ పాయింట్ అప్డేట్ చేయడం మంచిది. IRCTC యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారా మార్పులు చేసేటప్పుడు చివరి నిమిషం వరకు వేచి ఉండకూడదు. ఎందుకంటే చార్ట్ తయారైన తర్వాత అవకాశాలు తగ్గిపోతాయి. అలాగే రైల్వే నుంచి వచ్చే SMS అలర్ట్స్, టికెట్ వివరాలు కూడా జాగ్రత్తగా పరిశీలించాలి. చిన్న నిర్లక్ష్యం వల్ల కన్ఫర్మ్ సీటు కోల్పోయే పరిస్థితి రావచ్చని ప్రయాణికులు గుర్తుంచుకోవాలి.




