Gold: మన దేశంలో ఎన్ని లక్షల కోట్ల బంగారం ఉందో తెలుసా..? వరల్డ్ టాప్- 10 బ్యాంకులు కూడా సరిపోవు

Gold: ప్రపంచంలోని టాప్-10 సెంట్రల్ బ్యాంకుల వద్ద ఉన్న మొత్తం బంగారం కంటే భారతీయ ఇళ్లలోనే ఎక్కువ బంగారం ఉందని అసోచామ్ వెల్లడించింది.

Naresh.k
Published on: 12 April 2026 9:03 AM IST
Gold
X

Gold: మన దేశంలో ఎన్ని లక్షల కోట్ల బంగారం ఉందో తెలుసా..? వరల్డ్ టాప్- 10 బ్యాంకులు కూడా సరిపోవు

ASSOCHAM: భారతీయులకు బంగారం అంటే కేవలం ఒక లోహం కాదు.. అదొక సెంటిమెంట్, ఒక భరోసా, అంతకు మించి లక్ష్మీదేవి స్వరూపం. పెళ్లిళ్లు, పండుగలు వస్తే చాలు, మన ఇళ్లలో పసిడి కళకళలాడుతుంటుంది. అయితే, ఈ పసిడి నిల్వలు ఇప్పుడు ప్రపంచాన్నే ఆశ్చర్యపరుస్తున్నాయి. ప్రపంచంలోని టాప్-10 దేశాల సెంట్రల్ బ్యాంకుల వద్ద ఉన్న మొత్తం బంగారం కంటే, భారతీయ ఇళ్లలోనే ఎక్కువ బంగారం ఉందని అసోచామ్ సంచలన గణాంకాలను వెల్లడించింది.

అమెరికా కంటే మనమే టాప్

వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ప్రకారం, ప్రపంచంలో అత్యధికంగా అమెరికా సెంట్రల్ బ్యాంక్ వద్ద 8,133 టన్నుల బంగారం ఉంది. కానీ, భారతీయ గృహస్థుల వద్ద ఉన్న బంగారం అంచనా 25,000 నుంచి 34,600 టన్నుల వరకు ఉంటుందని తెలుస్తోంది.

ప్రపంచ దేశాల బ్యాంకుల వద్ద నిల్వలు ఇలా (టన్నుల్లో)..

అమెరికా: 8,133

జర్మనీ: 3,350

ఇటలీ: 2,451

భారత కేంద్ర బ్యాంకు: 880.3

టాప్-10 దేశాల మొత్తం: 24,399.51 టన్నులు. అంటే, ప్రపంచంలోని పది అగ్ర దేశాల బ్యాంకులు అన్నీ కలిపినా, మన భారతీయ మహిళల బీరువాల్లో ఉన్న బంగారం ముందు తక్కువే.

భారత జీడీపీని మించిన విలువ

ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం చూస్తే, భారతీయ ఇళ్లలో ఉన్న ఈ బంగారం విలువ సుమారు రూ. 465 లక్షల కోట్లు. ఇది మన దేశ జీడీపీని కూడా మించిపోయిందని మోర్గాన్ స్టాన్లీ వంటి అంతర్జాతీయ సంస్థలు పేర్కొంటున్నాయి. మన దగ్గర ఉన్న ఈ డెడ్ ఇన్వెస్ట్‌మెంట్ కనుక ఆర్థిక కార్యకలాపాల్లోకి వస్తే, 2047 నాటికి భారత్ వికసిత దేశంగా మారడం ఖాయమని నిపుణులు చెబుతున్నారు.

ఆర్థిక వ్యవస్థకు ఎలా ఊతం?

బీరువాల్లో నిద్రపోతున్న బంగారాన్ని బయటకు తీసి, గోల్డ్ మానిటైజేషన్ పథకాల ద్వారా వినియోగిస్తే కలిగే లాభాలు చాలానే ఉన్నాయి. తయారీ , మౌలిక వసతుల రంగాలకు నిధులు అందుతాయి. రైతులకు తక్కువ వడ్డీకే బంగారంపై రుణాలు లభిస్తాయి. విదేశాల నుంచి బంగారం కొనాల్సిన అవసరం తగ్గుతుంది, తద్వారా విదేశీ మార్పిడి నిల్వలు ఆదా అవుతాయి.

Naresh.k

Naresh.k

Next Story