Hyderabad Real Estate: హైదరాబాద్ రియల్ ఎస్టేట్.. జూన్‌లో తగ్గిన ఇళ్ల రిజిస్ట్రేషన్లు.. కారణం ఇదే!
Hyderabad Real Estate: మార్కెట్ విలువ సవరణల నేపథ్యంలో హైదరాబాద్‌లో జూన్ 2026 లో గృహ రిజిస్ట్రేషన్లు 13% తగ్గాయి. పూర్తి వివరాలు నైట్ ఫ్రాంక్ నివేదికలో.
Hyderabad Real Estate: హైదరాబాద్ రియల్ ఎస్టేట్.. జూన్‌లో తగ్గిన ఇళ్ల రిజిస్ట్రేషన్లు.. కారణం ఇదే!
Hyderabad Real Estate: హైదరాబాద్ నగర రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో మే నెలలో భారీ స్థాయిలో లావాదేవీలు జరిగిన తర్వాత, జూన్ 2026లో నివాస గృహాల రిజిస్ట్రేషన్లు కొంత మేర మందగించాయి. ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ ‘నైట్ ఫ్రాంక్ ఇండియా’ (Knight Frank India) తాజా నివేదిక ప్రకారం.. ఈ ఏడాది జూన్‌లో హైదరాబాద్‌లో మొత్తం 5,560 నివాస గృహాల రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఇది గత ఏడాది జూన్‌తో పోలిస్తే (YoY) 13 శాతం, ఈ ఏడాది మే నెలతో పోలిస్తే (MoM) 33 శాతం తగ్గుదలను నమోదు చేసింది.
విలువ పరంగా తగ్గుదల:
రిజిస్ట్రేషన్ల సంఖ్యతో పాటు వాటి మొత్తం విలువ కూడా తగ్గింది. జూన్‌లో రిజిస్టర్ అయిన నివాస గృహాల మొత్తం విలువ రూ. 4,148 కోట్లుగా నమోదైంది. ఇది గత ఏడాది జూన్‌తో పోలిస్తే 10 శాతం, ఈ ఏడాది మే నెలతో పోలిస్తే 30 శాతం తక్కువ.
తగ్గుదలకు ప్రధాన కారణం ఏమిటి?
తెలంగాణ ప్రభుత్వం జూన్ 5, 2026 నుంచి అమల్లోకి తెచ్చిన రిజిస్ట్రేషన్ మార్గదర్శక విలువల (Guideline Values) సవరణే ఈ తాత్కాలిక తగ్గుదలకు ప్రధాన కారణం. భూముల విలువలు పెరగకముందే రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని కొనుగోలుదారులు భావించడంతో.. జూన్‌లో జరగాల్సిన అత్యధిక లావాదేవీలు మే నెలలోనే ముందే జరిగిపోయాయి. దీంతో మే నెలలో రికార్డు స్థాయి రిజిస్ట్రేషన్లు జరగగా, జూన్ వచ్చేసరికి మార్కెట్ సాధారణ స్థితికి చేరుకుంది.
తొలి అర్ధభాగంలో పటిష్ట వృద్ధి:
తాత్కాలికంగా జూన్ నెలలో తగ్గుదల కనిపించినప్పటికీ.. లాంగ్ రన్‌లో హైదరాబాద్ మార్కెట్ పటిష్టంగానే సాగుతోంది. జనవరి-జూన్ 2026 (H1 2026) కాలానికి గాను నగరంలో నివాస గృహాల రిజిస్ట్రేషన్లు అంతకుముందు ఏడాదితో పోలిస్తే 5 శాతం పెరిగి 37,992 యూనిట్లకు చేరుకున్నాయి. అలాగే రిజిస్టర్ అయిన ఆస్తుల మొత్తం విలువ 6 శాతం వృద్ధితో రూ. 26,400 కోట్లుగా నమోదైంది.
ఈ పరిణామాలపై నైట్ ఫ్రాంక్ ఇండియా ఎండీ శిశిర్ బైజల్ మాట్లాడుతూ.. "జూన్ నెలలో కనిపించిన ఈ తగ్గుదల మార్కెట్ బలహీనతను కాకుండా, మార్గదర్శక విలువల మార్పు నేపథ్యంలో జరిగిన ఒక సహజమైన సర్దుబాటును మాత్రమే సూచిస్తుంది. 2026 మొదటి ఆరు నెలల్లో రిజిస్ట్రేషన్లు 5%, లావాదేవీల విలువలు 6% పెరగడమే దీనికి నిదర్శనం. నగరంలో పెరుగుతున్న ఉపాధి అవకాశాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి మరియు నిరంతర ఎండ్-యూజర్ డిమాండ్ వల్ల హైదరాబాద్ రియాల్టీ మార్కెట్ స్థిరంగా ము ముందుకు సాగుతోంది" అని విశ్లేషించారు.




