Meta: మెటాకు రూ.7,800 కోట్ల భారీ షాక్.. పిల్లల భద్రత నిర్లక్ష్యంపై కోర్టు చారిత్రాత్మక తీర్పు

Meta: పిల్లల మానసిక ఆరోగ్యానికి హాని కలిగించినందుకు మెటా సంస్థకు రూ.7,800 కోట్ల జరిమానా విధిస్తూ న్యూ మెక్సికో కోర్టు తీర్పునిచ్చింది.

Naresh.k
Updated on: 8 Aug 2026 9:30 AM IST
Meta
X

Meta: మెటాకు రూ.7,800 కోట్ల భారీ షాక్.. పిల్లల భద్రత నిర్లక్ష్యంపై కోర్టు చారిత్రాత్మక తీర్పు

Meta Fine: సోషల్ మీడియా రారాజు మెటా సంస్థకు గట్టి షాక్ తగిలింది. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వేదికలపై పిల్లలు, టీనేజర్ల మానసిక ఆరోగ్యానికి హాని కలిగించడంతో పాటు వారి భద్రతను నిర్లక్ష్యం చేసినందుకుగానూ మెటాకు సుమారు రూ.4,700 కోట్లు భారీ జరిమానా విధిస్తూ న్యూ మెక్సికో కోర్టు చారిత్రాత్మక తీర్పునిచ్చింది.

న్యూ మెక్సికో అటార్నీ జనరల్ రౌల్ టోరెజ్ దాఖలు చేసిన ఈ సంచలనాత్మక కేసు విచారణ రెండు దశల్లో సాగింది. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వాడకం వల్ల పిల్లల మానసిక ఆరోగ్యానికి జరిగే నష్టాన్ని దాచిపెట్టి, కస్టమర్లను మోసం చేసినందుకుగానూ జ్యూరీ మెటాకు రూ.3,100 కోట్లు జరిమానా విధించింది. న్యాయమూర్తి బ్రయాన్ బీడ్‌షీడ్ అదనంగా మరో రూ.4,700 కోట్లు జరిమానా విధించారు. దీంతో ఈ ఒక్క కేసులోనే మెటా చెల్లించాల్సిన మొత్తం జరిమానా ఏకంగా రూ.7,800 కోట్లకు చేరింది.

కోర్టు స్పష్టమైన ఆదేశాల ప్రకారం.. ఈ జరిమానా మొత్తంలో సుమారు రూ.3,500 కోట్లు సోషల్ మీడియా అడిక్షన్, మానసిక సమస్యలతో బాధపడుతున్న యువతకు వైద్యం మరియు కౌన్సెలింగ్ అందించేందుకు కేటాయించనున్నారు.

ఈ ఘోర పరాజయంపై మెటా ప్రతినిధులు స్పందిస్తూ..మా ప్లాట్‌ఫారమ్‌లలో టీనేజర్ల భద్రతకే అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. వారి రక్షణ కోసం నిబంధనలను నిరంతరం మెరుగుపరుస్తున్నాం. అయితే, న్యూ మెక్సికో కోర్టు ఇచ్చిన ఈ ఉత్తర్వులపై పైకోర్టులో అప్పీలు చేస్తామని సంస్థ ప్రతినిధి తెలిపారు. పిల్లల భద్రత విషయంలో సోషల్ మీడియా దిగ్గజాలపై ప్రపంచవ్యాప్తంగా కఠిన చర్యలు మొదలయ్యాయనడానికి ఈ తీర్పు ఒక ప్రధాన ఉదాహరణగా నిలిచింది.

Naresh.k

Naresh.k

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story