Home Loan: మీ ఇంటి లోన్ మీ ఇల్లే తీర్చేసే.. అదిరిపోయే ఐడియా ఇది..

Home Loan: సొంత ఇల్లు కట్టుకోవాలని కలలు కంటున్నారా? అయితే మీ సొంత డబ్బులతో కాకుండా బ్యాంకు డబ్బులతో ఇల్లు ఎలా కట్టుకోవాలో తెలుసా.?

Ravi
By Ravi
Published on: 4 Jun 2026 12:24 PM IST
Home Loan
X

Home Loan: మీ ఇంటి లోన్ మీ ఇల్లే తీర్చేసే.. అదిరిపోయే ఐడియా ఇది..

Home Loan: "మూర్ఖులు ఇల్లు కట్టుకుంటారు, తెలివైన వాళ్ళు ఆ ఇంట్లో అద్దెకు ఉంటారు" అనే సామెతను మనం ఎక్కడో ఒకచోట వినే ఉంటాం. కానీ, అసలైన తెలివైనవాడు తన సొంత డబ్బులతో కాకుండా బ్యాంకు డబ్బులతో ఇల్లు కట్టుకుంటాడని ఫైనాన్షియల్ ప్లానర్లు చెబుతున్నారు. సొంత ఇల్లు ఎలా కట్టుకోవాలి, హోమ్ లోన్‌ను తెలివిగా ఎలా ప్లాన్ చేసుకోవాలి అనే విషయాలపై ఆయన ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు.

చాలామంది సొంత ఇల్లు కట్టుకోవాలనుకున్నప్పుడు తమ దగ్గర ఉన్న డబ్బులన్నీ అందులోనే పెట్టేస్తుంటారు. అలా మొత్తం డబ్బును ఇంటిపైనే పెట్టకూడదు. "ఇంటి రుణం ఇల్లే తీరుస్తుంది" అనే అద్భుతమైన కాన్సెప్ట్‌ను తెలుసుకోవాలన్నారు. సాధారణంగా హోమ్ లోన్‌కి 8 నుండి 9 శాతం వడ్డీ పడుతుంది. అయితే అదే సమయంలో ఆస్తి విలువ, ద్రవ్యోల్బణం కూడా పెరుగుతూ ఉంటాయి. ఒక మంచి ఏరియా చూసి, అద్దెలు బాగా వచ్చేలా ఇల్లు నిర్మించుకుంటే, మొదటి ఐదేళ్లు మాత్రమే మనం ఈఎంఐ కట్టడానికి కాస్త ఇబ్బంది పడాల్సి వస్తుందని చెప్పారు. ఆ తర్వాత ఆ ఇంటిపై వచ్చే అద్దెతోనే ఆడుతూ పాడుతూ లోన్ ఈఎంఐలన్నీ ఈజీగా కట్టేయవచ్చని స్పష్టం చేశారు.

హోమ్ లోన్ అనేది కేవలం ఒక అప్పు మాత్రమే కాదు, దానిని ఒక 'ఫోర్సబుల్ సేవింగ్ స్కీమ్'గా చూడాలని ఫైనాన్సియల్ ప్లానర్ సూచించారు. మనం మామూలుగా డబ్బు పొదుపు చేయాలనుకున్నా ఏదో ఒక ఖర్చు వచ్చి అది కాస్తా ఆగిపోతుంది. కానీ లోన్ తీసుకుంటే తప్పనిసరిగా ఆ ఈఎంఐ కడుతూనే ఉంటాం కాబట్టి అది ఒక రకమైన క్రమశిక్షణతో కూడిన పొదుపులా మారుతుంది. దానికి తోడు ప్రాపర్టీ విలువ కూడా పెరుగుతూ ఉంటుంది. మనం ఈఎంఐలు సక్రమంగా కడుతూ ఉంటే మన సిబిల్ స్కోర్ పెరుగుతుంది. భవిష్యత్తులో పిల్లల చదువుల కోసమో, పర్సనల్ అవసరాల కోసమో బ్యాంకులు సులభంగా మళ్లీ లోన్లు మంజూరు చేస్తాయని తెలిపారు.

కాబట్టి, మీ దగ్గర ఉన్న డబ్బులన్నీ కేవలం ఇంటి నిర్మాణం కోసమే ఖర్చు చేయకండి. తెలివిగా హోమ్ లోన్ తీసుకుని ఇల్లు నిర్మించుకోండి. ఆ మిగిలిన సొంత డబ్బును మంచి రాబడి వచ్చే ఇతర పెట్టుబడి సాధనాల్లో అంటే స్టాక్ మార్కెట్ లేదా మరేదైనా వ్యాపారంలో పెట్టుబడిగా పెట్టుకోవచ్చని ఆయన సలహా ఇచ్చారు.

Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.

Next Story