Home Loan EMI: ఈ చిన్న ట్రిక్‌తో హోమ్‌లోన్‌పై లక్షల్లో ఆదా చేసుకోవచ్చు
Home Loan EMI: ప్రతి ఒక్కరి కల స్వంత ఇల్లు కొనడం. అయితే ప్రస్తుతం ఇళ్ల ధరలు భారీగా పెరగడంతో చాలామంది హోమ్ లోన్‌పై ఆధారపడుతున్నారు.
Home Loan EMI: ఈ చిన్న ట్రిక్‌తో హోమ్‌లోన్‌పై లక్షల్లో ఆదా చేసుకోవచ్చు
Home Loan Tips: ప్రతి ఒక్కరి కల స్వంత ఇల్లు కొనడం. అయితే ప్రస్తుతం ఇళ్ల ధరలు భారీగా పెరగడంతో చాలామంది హోమ్ లోన్‌పై ఆధారపడుతున్నారు. ఈ సమయంలో హోమ్ లోన్ తీసుకునేటప్పుడు తల్లిని కో-అప్లికెంట్‌గా చేర్చడం వల్ల అనేక ఆర్థిక ప్రయోజనాలు పొందవచ్చు. ట్యాక్స్ ఆదా నుంచి తక్కువ వడ్డీ వరకు ఎన్నో లాభాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ట్యాక్స్‌లో భారీ మినహాయింపులు పొందొచ్చు
హోమ్ లోన్‌లో మీరు, మీ అమ్మ ఇద్దరూ కో-బారోయర్లుగా ఉంటే ఆదాయపన్ను చట్టం ప్రకారం ఇద్దరూ విడివిడిగా ట్యాక్స్ బెనిఫిట్స్ పొందే అవకాశం ఉంటుంది. సెక్షన్ 80C కింద అసలు రుణ చెల్లింపుపై రూ.1.5 లక్షల వరకు మినహాయింపు ఉంటుంది. సెక్షన్ 24(b) కింద వడ్డీ చెల్లింపుపై రూ.2 లక్షల వరకు ట్యాక్స్ బెనిఫిట్ పొందొచ్చు. ఇలా మీరు, మీ అమ్మ ఇద్దరూ కలిపి ఒకే కుటుంబంగా లక్షల్లో ట్యాక్స్ సేవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఈ ప్రయోజనం పొందాలంటే ఇద్దరికీ ఆదాయ వనరు ఉండాలి.
మహిళలకు తక్కువ వడ్డీ రేట్ల ప్రయోజనం
దేశంలోని చాలా బ్యాంకులు మహిళలకు ప్రత్యేక హోమ్ లోన్ వడ్డీ రాయితీలు ఇస్తున్నాయి. సాధారణంగా 0.05% నుంచి 0.10% వరకు వడ్డీ తగ్గింపు లభిస్తుంది. ఇది చిన్న తగ్గింపుగా కనిపించినా, 20 నుంచి 30 ఏళ్ల హోమ్ లోన్ కాలంలో చూస్తే లక్షల్లో వడ్డీ ఆదా అవుతుంది. దీంతో మీ EMI కూడా కొంత వరకు తగ్గే అవకాశం ఉంటుంది.
లోన్ అర్హత పెరిగే అవకాశం
చాలామందికి సరిపడా జీతం లేకపోవడంతో బ్యాంకులు పెద్ద మొత్తంలో హోమ్ లోన్ మంజూరు చేయవు. అలాంటి సమయంలో అమ్మను కో-అప్లికెంట్‌గా చేర్చితే ఆమె ఆదాయాన్ని కూడా బ్యాంకు పరిగణలోకి తీసుకుంటుంది. దీంతో లోన్ అర్హత పెరుగుతుంది, ఎక్కువ మొత్తంలో రుణం పొందొచ్చు, మంచి ఇల్లు కొనుగోలు చేసే అవకాశం లభిస్తుంది. అంటే మీ కలల ఇంటిని సులభంగా సొంతం చేసుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది.
కుటుంబానికి ఆర్థిక భద్రత కూడా లభిస్తుంది
అమ్మను కో-ఓనర్ లేదా కో-అప్లికెంట్‌గా చేర్చడం వల్ల ఆమెకు ఆస్తిపై చట్టబద్ధమైన హక్కు కూడా ఉంటుంది. ఇది కుటుంబ భవిష్యత్తుకు భద్రత కల్పించడంలో సహాయపడుతుంది. అలాగే భవిష్యత్తులో ఆస్తి వారసత్వ సమస్యలు తగ్గుతాయి, కుటుంబ సభ్యులకు ఆర్థిక రక్షణ ఉంటుంది. ఆస్తి బదిలీ ప్రక్రియ సులభమవుతుంది. అందుకే హోమ్ లోన్ తీసుకునే ముందు కుటుంబ పరిస్థితులు, ట్యాక్స్ ప్రయోజనాలు, భవిష్యత్తు అవసరాలు అన్నింటినీ పరిగణలోకి తీసుకుని నిర్ణయం తీసుకోవడం మంచిదని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.
గమనిక: పైన తెలిపిన వివరాలను కేవలం ప్రాథమిక సమాచారంగానే భావించాలి. పెట్టుబడుల విషయంలో నిర్ణయాలు తీసుకునే ముందు ఆర్థిక నిపుణుల సూచనలు పాటించడం ఉత్తమం.




