HDFC: హెచ్డీఎఫ్సీ నుంచి రెండు అద్భుతమైన స్కీమ్స్.. చేతిలో రూ. 100 ఉంటే చాలు
HDFC: హెచ్డీఎఫ్సీ మ్యూచువల్ ఫండ్ నిఫ్టీ మెటల్ ఇండెక్స్‌ను ట్రాక్ చేస్తూ సరికొత్తగా ETF , ఫండ్ ఆఫ్ ఫండ్లను లాంచ్ చేసింది.
HDFC: హెచ్డీఎఫ్సీ నుంచి రెండు అద్భుతమైన స్కీమ్స్.. చేతిలో రూ. 100 ఉంటే చాలు
HDFC Mutual Fund: మ్యూచువల్ ఫండ్ రంగంలో అగ్రగామిగా ఉన్న హెచ్డీఎఫ్సీ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్ల కోసం అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. కమోడిటీ, సెక్టోరల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వారిని ఆకర్షించేందుకు ఒకేసారి రెండు సరికొత్త ప్యాసివ్ ఫండ్లను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. నిఫ్టీ మెటల్ ఇండెక్స్‌ను ట్రాక్ చేసేలా హెచ్డీఎఫ్సీ నిఫ్టీ మెటల్ ఈటీఎఫ్ , డీమ్యాట్ అకౌంట్ లేని సాధారణ ఇన్వెస్టర్ల కోసం హెచ్డీఎఫ్సీ మెటల్ ఈటీఎఫ్ ఫండ్ ఆఫ్ ఫండ్లను లాంచ్ చేసింది. ఈ రెండు కొత్త ఫండ్ ఆఫర్లు జులై 20 నుంచే సబ్స్క్రిప్షన్ కోసం అందుబాటులోకి వచ్చాయి.
హెచ్డీఎఫ్సీ నిఫ్టీ మెటల్ ఈటీఎఫ్
డీమ్యాట్ అకౌంట్ ఉండి, లైవ్ మార్కెట్లో ట్రేడింగ్ చేయాలనుకునే ఇన్వెస్టర్లకు ఇది బెస్ట్ ఆప్షన్. సబ్స్క్రిప్షన్ తేదీలు.. జులై 20, 2026 నుంచి జులై 24, 2026 వరకు. కనీస పెట్టుబడి రూ. 500. డీమ్యాట్ అకౌంట్ తప్పనిసరి. ఫేస్ వాల్యూ.. ఎన్ఎఫ్ఓ సమయంలో పర్ యూనిట్ విలువ రూ. 10 గా ఉంటుంది.
హెచ్డీఎఫ్సీ నిఫ్టీ మెటల్ ఈటీఎఫ్ ఫండ్ ఆఫ్ ఫండ్
డీమ్యాట్ అకౌంట్ లేని వారు కూడా సాధారణ మ్యూచువల్ ఫండ్స్ లాగే సిప్ పద్ధతిలో ఇన్వెస్ట్ చేసేందుకు దీనిని తీసుకొచ్చారు. సబ్స్క్రిప్షన్ తేదీలు.. జులై 20, 2026 నుంచి ఆగస్టు 3, 2026 వరకు.కనీస పెట్టుబడి.. కేవలం రూ. 100 మాత్రమే. ఫేస్ వాల్యూ.. పర్ యూనిట్ విలువ రూ. 10 గా ఉంటుంది.
ఈ రెండు ఫండ్లు నేరుగా నిఫ్టీ మెటల్ ఇండెక్స్‌లోని టాప్ 15 మైనింగ్, మెటల్ దిగ్గజ కంపెనీలలో పెట్టుబడి పెడతాయి. ఇందులో టాటా స్టీల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, హిందాల్కో, వేదాంత వంటి మార్కెట్ లీడర్స్ ఉన్నాయి. భవిష్యత్తులో దేశీయంగా, అంతర్జాతీయంగా మెటల్ రంగానికి డిమాండ్ పెరిగినప్పుడు ఈ ఫండ్ల ద్వారా ఇన్వెస్టర్లకు అద్భుతమైన రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. మీకు డీమ్యాట్ అకౌంట్ ఉంటే ఈటీఎఫ్ ఆప్షన్ ద్వారా నేరుగా మార్కెట్లో ట్రేడ్ చేయవచ్చు. డీమ్యాట్ అకౌంట్ లేకపోతే, ఎలాంటి ఇబ్బంది లేకుండా సాధారణ సిప్ పద్ధతిలో కేవలం రూ. 100 తోనే ఫండ్ ఆఫ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చు.
మీరు మెటల్ రంగం వృద్ధిపై నమ్మకంతో ఉండి, మీ పోర్ట్‌ఫోలియోను డైవర్సిఫై చేయాలనుకుంటే ఈ ఎన్ఎఫ్ఓల గడువు ముగిసేలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే, సెక్టోరల్ ఫండ్స్ మార్కెట్ హెచ్చుతగ్గుల వల్ల సాధారణ ఫండ్స్ కంటే ఎక్కువ రిస్క్‌తో కూడుకున్నవి. కాబట్టి, పెట్టుబడి పెట్టే ముందు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా తీసుకోవడం మంచిది.




