Gold Rate Today : పసిడి ప్రియులకు షాక్ మీద షాక్.. మళ్లీ పెరుగుతున్న బంగారం, వెండి ధరలు
Gold Rate Today : బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు శనివారం (మే 30, 2026) మళ్లీ పెరిగాయి. హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 1,57,650 కి చేరింది.
Gold Rate Today
Gold Rate Today : బంగారం కొనాలని ప్లాన్ చేస్తున్నారా..? అయితే బులియన్ మార్కెట్ నుంచి బ్యాడ్ న్యూస్. గత కొన్ని రోజులుగా కాస్త శాంతించినట్లు కనిపించిన పసిడి ధరలు.. ఇప్పుడు మళ్లీ నాన్‌స్టాప్‌గా పరుగులు పెడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మారుతున్న ఆర్థిక పరిణామాలు, భౌగోళిక ఉద్రిక్తతలు, దేశీయంగా పెరిగిన డిమాండ్ కారణంగా శనివారం (మే 30, 2026) బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. నిన్న ఒక్కరోజే భారీగా పెరిగిన రేట్లు.. ఈరోజు కూడా అదే జోరును కొనసాగిస్తూ కస్టమర్లకు షాక్ ఇస్తున్నాయి. శనివారం ఉదయం బులియన్ మార్కెట్ వెబ్‌సైట్ల ఆధారంగా నమోదైన తాజా రేట్లు ఏంటో తెలుసుకుందాం.
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో బంగారం ధరలు స్థిరంగా పెరిగాయి. ఈరోజు మార్కెట్లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన పసిడి ధర 10 గ్రాములపై (తులం) రూ.10 మేర పెరిగి రూ. 1,57,650 వద్ద కొనసాగుతోంది. అదేవిధంగా, ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం ధర కూడా తులముపై రూ.10 పెరిగి రూ.1,44,510 వద్ద నమోదైంది. పెళ్లిళ్ల సీజన్ కావడం వల్ల మార్కెట్లో కొనుగోళ్లు జోరందుకోవడమే ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు.
దేశంలోని మిగిలిన ప్రధాన నగరాల్లో కూడా బంగారం ధరలు విభిన్నంగా ఉన్నాయి. దేశ రాజధాని న్యూఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 1,57,650 గా ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ. 1,44,660 గా నమోదైంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 24 క్యారెట్ల ధర రూ. 1,57,650, 22 క్యారెట్ల ధర రూ. 1,44,510 గా ఉంది. ఇకపోతే దక్షిణాదిలోనే అత్యధికంగా చెన్నైలో 24 క్యారెట్ల పసిడి ధర రూ. 1,59,290 కి చేరగా.. 22 క్యారెట్ల ధర రూ. 1,46,010 వద్ద కొనసాగుతోంది. ఐటీ హబ్ బెంగళూరులో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 1,57,650 గా ఉంది.
బంగారంతో పాటే వెండి ధరలు కూడా సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. బులియన్ మార్కెట్లో శనివారం ఉదయం నాటికి కిలో వెండి ధరపై రూ.100 మేర పెరిగింది. ప్రస్తుతం దేశీయంగా సగటు వెండి ధర కిలో రూ. 2,80,100 గా ఉంది. అయితే స్థానిక పన్నుల కారణంగా తెలుగు రాష్ట్రాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంతో పాటు చెన్నై నగరంలో కిలో వెండి ధర ఏకంగా రూ. 2,90,100 వద్ద గరిష్ట స్థాయిలో కొనసాగుతోంది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు నగరాల్లో కిలో వెండి రూ. 2,80,100 వద్ద ట్రేడ్ అవుతోంది.




