Gold Price Today : మళ్లీ జోరందుకుంటున్న పసిడి రేట్లు.. గందరగోళంలో కొనుగోలుదారులు

Gold Price Today : ఆగస్టు 1న దేశీయంగా బంగారం ధరలు మళ్లీ పుంజుకున్నాయి. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,44,610 కాగా, వెండి కిలో రూ.2,34,900 వద్ద కొనసాగుతోంది.

CR Reddy
Published on: 1 Aug 2026 7:00 AM IST
Gold Price Today
X

Gold Price Today

Gold Price Today : ఇటీవల ముగిసిన యూఎస్ ఫెడరల్ రిజర్వ్ కీలక సమావేశం అనంతరం అంతర్జాతీయ, దేశీయ బులియన్ మార్కెట్లలో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. గ్లోబల్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు గణనీయంగా తగ్గుముఖం పట్టినప్పటికీ మన దేశీయ మార్కెట్‌లో మాత్రం బంగారం రేట్లు రివర్స్ గేర్‌లో పరుగులు తీస్తున్నాయి. గ్లోబల్ ట్రేడింగ్ ప్లాట్‌ఫారమ్ అయిన కామెక్స్‎లో గురువారం ఉదయం సమయానికి పసిడి ధర 0.67 శాతం తగ్గి, ఒక ఔన్సుకు $4,132.70 డాలర్లకు చేరుకుంది. అలాగే వెండి ధర కూడా 0.67 శాతం తగ్గి ఔన్సుకు $58.62 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. కానీ మన భారతీయ మార్కెట్లలో మాత్రం గడిచిన రెండు, మూడు రోజులుగా బంగారం ధర వెయ్యి రూపాయలకు పైగానే పెరగడం గమనార్హం.

హైదరాబాద్, తెలుగు రాష్ట్రాల్లో నేటి పసిడి ధరలు

ఆగస్టు 1వ తేదీ ఉదయం 6 గంటల సమయానికి నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌తో పాటు విజయవాడలో 24 క్యారెట్ల గోల్డ్ (10 గ్రాములు) ధర రూ.1,44,610 వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,32,560 వద్ద నమోదైంది. గత కొన్ని రోజులుగా నిలకడగా ఉన్నట్లే అనిపించినా, ఉన్నట్లుండి పెరిగిన ఈ ధరలు పసిడి ప్రియులకు, పెళ్లిళ్ల షాపింగ్ చేసేవారికి కాస్త ఆందోళన కలిగిస్తున్నాయి.

దేశంలో ఇతర ప్రధాన నగరాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే?

దేశ రాజధాని ఢిల్లీలో మిగతా నగరాల కంటే కాస్త ఎక్కువగా పసిడి రేట్లు నమోదయ్యాయి. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ.1,44,760 కాగా, 22 క్యారెట్ల ధర రూ.1,32,710 వద్ద ఉంది. ఇక వాణిజ్య రాజధాని ముంబైతో పాటు చెన్నై, బెంగళూరు, కేరళ రాష్ట్రాల్లోనూ హైదరాబాద్ రేట్లే కొనసాగుతున్నాయి. అక్కడ 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,44,610 గానూ, 22 క్యారెట్ల ధర రూ.1,32,560 గానూ నమోదైంది.

వెండి ధరల్లో స్వల్ప ఉపశమనం

బంగారం రేట్లు పైపైకి పోతుంటే, వెండి మాత్రం కొనుగోలుదారులకు కాస్త ఊరటనిచ్చింది. ప్రస్తుతం దేశీయ మార్కెట్‌లో కేజీ వెండి ధర రూ.2,34,900 వద్ద స్థిరంగా కొసాగుతోంది. అయితే ఈ ధరలన్నీ ఉదయం 6 గంటల సమయానికి అందిన సమాచారం ప్రకారం మాత్రమేనని గమనించాలి. రోజంతా జరిగే బులియన్ ట్రేడింగ్‌ను బట్టి ఈ ధరలు పెరగవచ్చు లేదా తగ్గవచ్చు.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story