Gold Rate Today: బంగారం కొనేవారికి ఊరట.. తగ్గతున్న గోల్డ్, సిల్వర్ రేట్లు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
Gold Rate Today: గత కొద్ది రోజులుగా బంగారం ధర చూస్తే సామాన్యులకు షాక్ తగిలేలా పెరిగింది.
Gold Rate Today
Gold Rate Today: గత కొద్ది రోజులుగా బంగారం ధర చూస్తే సామాన్యులకు షాక్ తగిలేలా పెరిగింది. తులం పసిడి ఏకంగా రూ.2 లక్షల మార్కును తాకుతుందని అంతా భావించారు. అంతర్జాతీయ మార్కెట్లో చోటు చేసుకున్న కీలక పరిణామాలు బంగారం, వెండి ధరల వైపు ఇన్వెస్టర్లు మొగ్గు చూపకుండా చేశాయి. అమెరికా సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్లను పెంచడం, యూఎస్ ట్రెజరీ బాండ్ల రాబడులు పెరగడం వంటి పరిణామాలు పసిడి ధరలు తగ్గడానికి ప్రధాన కారణమయ్యాయి. సాధారణంగా బాండ్ల రాబడి పెరిగినప్పుడు పెట్టుబడిదారులు వడ్డీ రాని బంగారం కంటే గవర్నమెంట్ బాండ్లలోనే ఎక్కువ పెట్టుబడులు పెడతారు. దీంతో గోల్డ్‌పై పెట్టుబడులు తగ్గి రేట్లు దిగొచ్చాయి.
హైదరాబాద్, తెలంగాణ ప్రాంతాల్లో పసిడి రేట్లు
ప్రస్తుతం నగరంలో బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఈ ధరల తగ్గుదల కొంత ఉపశమనం కలిగిస్తోంది. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన తులం బంగారం ధర రూ.1,54,790 వద్ద లభ్యమవుతోంది. ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,41,890 వద్ద ట్రేడవుతోంది. ఐటీ నగరమైన బెంగళూరులోనూ సరిగ్గా ఇవే ధరలు కొనసాగుతుండటం గమనార్హం. గత రెండు రోజులతో పోలిస్తే ఈ ధరలు స్వల్పంగా తగ్గడంతో పండగ సీజన్ ముందు కొనుగోలుదారులకు కాస్త ఊరట లభించినట్లయింది.
ఏపీ, ఢిల్లీ నగరాల్లో బంగారం ధరలు
ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో బంగారం ధరలు హైదరాబాద్ కంటే స్వల్పంగా ఎక్కువగా ఉన్నాయి. అక్కడ 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,56,660 వద్ద కొనసాగుతుండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,43,600 వద్దకు చేరింది. వాణిజ్య రాజధాని ముంబై, చెన్నై నగరాల్లో కూడా సరిగ్గా ఏపీ తరహాలోనే రేట్లు నమోదయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్లో మాత్రం 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ రేటు రూ.1,54,940 గా ఉండగా, 22 క్యారెట్ల తులానికి రూ.1,42,040 చొప్పున విక్రయాలు జరుగుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ధర ఎంతంటే ?
పసిడి బాటలోనే వెండి ధరలు కూడా దిగొస్తున్నాయి. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో వెండి ధరల సరళి వేర్వేరుగా నమోదైంది. హైదరాబాద్, చెన్నై నగరాల్లో కిలో వెండి ధర రూ.2,54,800 వద్ద కొనసాగుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.2,49,900 వద్ద ట్రేడవుతోంది. ముంబై, కోల్‌కతా, బెంగళూరు, పూణే వంటి ప్రధాన నగరాల్లో కూడా కిలో వెండి రేటు రూ.2,49,900 వద్దే స్థిరంగా సాగుతోంది.




