Gold Rate Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు

Gold Rate Today: నేటి బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధర లక్షన్నర పైగా పడిపోవడంతో సామాన్యులకు ఊరట లభించింది.

CR Reddy
Published on: 2 May 2026 7:36 AM IST
Gold Rate Today
X

Gold Rate Today

Gold Rate Today: బంగారం కొనాలనుకునే వారికి ఇది కాస్త ఊరట కలిగించే వార్త. నిన్నటి వరకు ఆకాశమే హద్దుగా పెరిగిన పసిడి ధరలు, నేడు స్వల్పంగా దిగివచ్చాయి. అటు వెండి ధరలు కూడా భారీగా పతనం కావడంతో సామాన్యులకు కాస్త ఊరట లభించినట్లయింది. దేశీయంగా, అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక పరిస్థితుల ప్రభావం ఈ ధరల మార్పులపై చాలా స్పష్టంగా కనిపిస్తోంది. గత కొన్ని రోజులుగా చుక్కలను తాకిన బంగారం ధరలు మే 2వ తేదీన స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. ముఖ్యంగా దేశీయ మార్కెట్లలో పసిడి ధరలు తగ్గడం వినియోగదారులకు కలిసొచ్చే అంశం. గుడ్ రిటర్న్స్ సమాచారం ప్రకారం.. హైదరాబాద్‌తో పాటు ప్రధాన నగరాల్లో 24 క్యారెట్ల తులం బంగారం ధర నేడు రూ.1,50,370 వద్ద కొనసాగుతోంది. అలాగే నగలు తయారీలో వాడే 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,37,840 కి చేరింది. నిన్నటితో పోలిస్తే ఈ తగ్గుదల స్వల్పంగా ఉన్నప్పటికీ, వరుస పెరుగుదలకు బ్రేక్ పడటం విశేషం.

వెండి ధరల్లో పతనం

ఈసారి బంగారం కంటే వెండి ధరల్లోనే భారీ మార్పు కనిపిస్తోంది. గత జనవరిలో కిలో వెండి ధర గరిష్టంగా రూ.4,25,000 పలకగా, ప్రస్తుతం అది రూ.2,65,000 కి పడిపోయింది. అంటే దాదాపు రూ.1,55,000 మేర ధర తగ్గింది. ఆల్ టైమ్ హై నుంచి వెండి ఈ స్థాయిలో పడిపోవడం పెట్టుబడిదారులను విస్మయానికి గురిచేస్తోంది. హైదరాబాద్, విజయవాడలో ప్రస్తుతం కిలో వెండి ధర రూ.2,64,900 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. ఢిల్లీ, ముంబై వంటి నగరాల్లో ఇది ఇంకాస్త తక్కువగా, రూ.2,55,100 వద్ద ట్రేడ్ అవుతోంది.

ప్రధాన నగరాల్లో ధరల వ్యత్యాసం

దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,50,420 గా ఉండగా, చెన్నైలో మాత్రం ధరలు కాస్త ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ తులం బంగారం రూ. 1,51,850 వద్ద ట్రేడవుతోంది. బెంగళూరు మరియు ముంబై నగరాల్లో మాత్రం హైదరాబాద్ తరహాలోనే ధరలు కొనసాగుతున్నాయి. స్థానిక పన్నులు మరియు ఇతర సుంకాల కారణంగా ఒక్కో నగరంలో ధరల్లో స్వల్ప తేడాలు కనిపిస్తుంటాయి. అయితే దేశవ్యాప్తంగా వెండి ధరలు మాత్రం భారీగానే తగ్గాయని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.

అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం

దేశీయంగా ధరలు తగ్గినప్పటికీ, అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం బంగారం, వెండి ధరలు పుంజుకోవడం ఆశ్చర్య కలిగిస్తోంది. ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 4552 డాలర్ల వద్ద ఉండగా, వెండి ధర 74.18 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. సాధారణంగా అంతర్జాతీయంగా ధరలు పెరిగితే దేశీయంగా కూడా పెరుగుతాయి. కానీ ప్రస్తుతం ఎంసీఎక్స్ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ రూ.1,51,225 వద్ద స్థిరంగా కొనసాగుతుండటం గమనార్హం. రాబోయే రోజుల్లో రూపాయి విలువ, ప్రపంచ ఆర్థిక పరిస్థితుల ఆధారంగా ధరలు మళ్ళీ పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story