Gold Rate Today: కొనుగోలుదారులకు గట్టి షాక్.. చుక్కలనంటుతున్న పసిడి, వెండి ధరలు
Gold Rate Today: దేశీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు కొనుగోలుదారులకు తీవ్ర షాక్ ఇస్తున్నాయి. గత కొద్ది రోజులుగా పసిడి రేట్లలో ఊహించని మార్పులు కనిపిస్తున్నాయి.
Gold Rate Today
Gold Rate Today: దేశీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు కొనుగోలుదారులకు తీవ్ర షాక్ ఇస్తున్నాయి. గత కొద్ది రోజులుగా పసిడి రేట్లలో ఊహించని మార్పులు కనిపిస్తున్నాయి. గతంలో తులం బంగారం ధర రూ.1.40 లక్షల వద్ద ఊగిసలాడగా, ప్రస్తుతం ఏకంగా రూ.1,63,740 స్థాయికి చేరుకోవడం గమనార్హం. వరుసగా పెరుగుతూ వస్తున్న రేట్లకు ఎక్కడో చోట బ్రేక్ పడుతుందని భావిస్తున్న కొనుగోలుదారులకు నిరాశే ఎదురవుతోంది. పెళ్లిళ్ల సీజన్ దగ్గరపడుతున్న వేళ ఈ రేట్లు పసిడి ప్రియులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.
ప్రధాన నగరాల్లో నేటి పసిడి రేట్ల వివరాలు
ప్రస్తుతం మన తెలుగు రాష్ట్రాలైన హైదరాబాద్, విజయవాడల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,63,740 వద్ద ట్రేడవుతోంది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ఆభరణాల బంగారం ధర రూ.1,50,090గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల ధర రూ.1,63,890 కాగా, 22 క్యారెట్ల ధర రూ.1,50,240గా నమోదైంది. ముంబై, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా వంటి నగరాల్లోనూ హైదరాబాద్‌తో సమానంగా రూ.1,63,740 వద్దే విక్రయాలు జరుగుతున్నాయి.
భారీగా పెరిగిన వెండి వెలుగులు
బంగారానికి పోటీగా వెండి రేట్లు కూడా ఆకాశాన్ని తాకుతున్నాయి. మన దేశంలో కిలో వెండి ధర రూ.2,59,000 వద్ద ఉంటే, హైదరాబాద్ మార్కెట్‌లో మాత్రం మరింత ఎక్కువగా రూ.2,64,900 వద్ద విక్రయమవుతోంది. ఇతర ప్రధాన ప్రాంతాల్లో రూ.2,59,900 వద్ద వెండి ట్రేడవుతోంది. నాణేలు, వెండి వస్తువులకు డిమాండ్ పెరగడం కూడా ఈ ధరల పెంపునకు కారణంగా కనిపిస్తోంది.
అంతర్జాతీయ పరిణామాలు, ప్రాఫిట్ బుకింగ్ ప్రభావం
అంతర్జాతీయ మార్కెట్ వాతావరణం, అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు, డాలర్ బలం పుంజుకోవడం వంటి అంశాలు పసిడిపై ప్రభావం చూపుతున్నాయి. గ్లోబల్ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ ధర 1.4 శాతం తగ్గి ఔన్స్‌కు 4,592 డాలర్ల వద్ద విక్రయమవుతోంది. గోల్డ్ ఫ్యూచర్స్ ధర 0.9 శాతం తగ్గి 4,653 డాలర్ల వద్ద ముగిసింది. ఇటీవలి ర్యాలీలో లాభాలు పొందిన ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను ఉపసంహరించుకోవడంతో (ప్రాఫిట్ బుకింగ్) అంతర్జాతీయంగా స్వల్ప మార్పులు నమోదవుతున్నాయి. డాలర్ విలువ పెరిగినప్పుడు సాధారణంగా బంగారంపై ఒత్తిడి పెరిగి డిమాండ్ తగ్గుతుంది.




