Gold Prices Today: బంగారం కొనాలా వద్దా?...సంశయంలో పసిడి ప్రియులు...ఈరోజు ధరలు ఇవే

జూన్ 23, 2026న బులియన్‌ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా బంగారం కొనడం మంచిదా లేక వేచి చూడాలా? నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.

Balachander
Published on: 23 Jun 2026 8:03 AM IST
Gold Prices Today: బంగారం కొనాలా వద్దా?...సంశయంలో పసిడి ప్రియులు...ఈరోజు ధరలు ఇవే
X

Gold Prices Today: మధ్యతరగతి ప్రజలకు, పసిడి ప్రేమికులకు బంగారం ధరలు మళ్లీ ముక్కుతాడు వేస్తున్నాయి. ఇటీవల స్వల్పంగా తగ్గి ఊరటనిచ్చినట్లే కనిపించిన పసిడి రేట్లు.. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో మళ్లీ పుంజుకోవడం వినియోగదారులను తీవ్ర సంశయంలో పడేసింది. ప్రస్తుతం నడుస్తున్న ఇరాన్...అమెరికా యుద్ధ మేఘాలు, అంతర్జాతీయ భౌగోళిక ఉద్రిక్తతల కారణంగా బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు మళ్లీ క్రమంగా పుంజుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో జూన్ 23, 2026న దేశీయంగా బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

నేడు బులియన్‌ మార్కెట్‌ ధరలు

దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో మంగళవారం ఉదయం నమోదైన ధరల వివరాలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల బంగారంపై రూ.10 మేర స్వల్ప పెరుగుదల నమోదు కాగా, కిలో వెండిపై రూ.100 తగ్గింది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 1,46,520 కు చేరింది. అదేవిధంగా ఆభరణాల కోసం వినియోగించే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 1,34,310 వద్ద స్థిరపడింది. అదేవిధంగా కిలో వెండిపై రూ. 100 తగ్గింది. దీంతో ప్రస్తుతం బులియన్‌ మార్కెట్‌లో వెండి ధర కిలో రూ. 2,49,900గా కొనసాగుతోంది.

ఇప్పుడు కొనడం మంచిదేనా?

ప్రస్తుతం అంతర్జాతీయంగా డాలర్ విలువలో హెచ్చుతగ్గులు, యుద్ధ వాతావరణం వల్ల ప్రపంచ దేశాల కేంద్రీయ బ్యాంకులు బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా భావించి నిల్వ చేసుకుంటున్నాయి. దీనివల్ల ధరలు తగ్గే అవకాశాలు ప్రస్తుతానికి చాలా తక్కువగా ఉన్నాయని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాల కోసం పసిడి కొనాలనుకునే సామాన్యులు ధరలు ఇంకా పెరుగుతాయేమో అనే భయంతో ఇప్పుడే కొనుగోలు చేయడం ఉత్తమమని భావిస్తున్నారు. అయితే, పెట్టుబడి కోణంలో చూసేవారు మాత్రం మార్కెట్ మరికొంత స్థిరపడే వరకు నిరీక్షించడం మంచిదనేది నిపుణులు చెబుతున్నారు.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story