Gold Price Today : బులియన్ మార్కెట్లో భూకంపం.. సామాన్యుడికి అందని ద్రాక్షలా మారుతున్న పసిడి
Gold Price Today : సామాన్యుడికి బంగారం అంటే ఒక సెంటిమెంట్.. కానీ గతంలో ఎన్నడూ లేని విధంగా పసిడి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
Gold Price Today
Gold Price Today : ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు భారతీయ మార్కెట్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం ఇన్వెస్టర్లను సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం వైపు మళ్లించింది. దీనివల్ల డిమాండ్ పెరిగి ధరలు నాన్-స్టాప్‌గా పెరుగుతున్నాయి. మధ్యలో కాస్త తగ్గినట్లు కనిపించినా, మళ్లీ పసిడి పరుగు మొదలుపెట్టింది. ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర లక్షన్నర మార్కును దాటేసి కొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఆదివారం (ఏప్రిల్ 5, 2026) ఉదయం నమోదైన ధరల ప్రకారం, దేశవ్యాప్తంగా 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.1,50,930 వద్ద కొనసాగుతోంది. అదేవిధంగా, ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,38,350గా ఉంది. వెండి కూడా ఏమాత్రం తగ్గకుండా కిలో రూ.2,50,000 మార్కును తాకింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరల పెరుగుదల, డాలర్ హెచ్చుతగ్గులు కూడా ఈ పెరుగుదలకు ప్రధాన కారణాలుగా మారుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో ధరల పరిస్థితి
మన తెలుగు రాష్ట్రాల్లో కూడా పసిడి మంట పుట్టిస్తోంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,50,930గా ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,38,350 వద్ద ఉంది. వెండి విషయానికి వస్తే స్థానిక పన్నులు, ఇతర ఛార్జీల కారణంగా ఈ నగరాల్లో కిలో వెండి ధర రూ.2,55,000 వరకు పలుకుతోంది. పెళ్లిళ్ల సీజన్ దగ్గరపడుతుండటంతో ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మెట్రో నగరాల్లో ఎలా ఉందంటే?
దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,51,080గా ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,38,500గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల ధర కొంచెం ఎక్కువగా రూ.1,39,500 వద్ద ఉంది. అటు చెన్నైలో 24 క్యారెట్ల బంగారం అత్యధికంగా రూ.1,52,180 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో హైదరాబాద్ తరహాలోనే ధరలు ఉన్నాయి. ప్రతి రాష్ట్రంలో ఉండే పన్నులు (GST), రవాణా ఖర్చులు, స్థానిక డిమాండ్ ఆధారంగా ఈ ధరల్లో వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి.




