Gold Price Today: పసిడి ప్రియులకు ఊహించని షాక్.. ఒక్కరోజులోనే పెరిగిన బంగారం ధరలు

Gold Price Today: దేశీయంగా బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. అంతర్జాతీయ ఉద్రిక్తతల కారణంగా గురువారం, శుక్రవారం (ఆగస్టు 7) పసిడి రేట్లు భగ్గుమన్నాయి.

CR Reddy
Published on: 7 Aug 2026 7:06 AM IST
Gold Price Today
X

Gold Price Today

Gold Price Today: దేశీయంగా బంగారం ధరల్లో ఊహించని మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవలే కొంత తగ్గి వినియోగదారులకు ఊరటనిచ్చిన పసిడి రేట్లు.. మళ్లీ అనూహ్యంగా పెరుగుతుండటంతో కొనుగోలుదారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గురువారం ఒక్కరోజే స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధరపై ఏకంగా రూ.2,890 వరకు పెరిగింది. దీంతో పసిడి ధరలు మళ్లీ చారిత్రాత్మక రికార్డు స్థాయికి చేరుకునేలా కనిపిస్తున్నాయి. శుక్రవారం (ఆగస్టు 7) ఉదయం సమయానికి కూడా పసిడి ధరల్లో స్వల్ప పెరుగుదల నమోదైంది.

అంతర్జాతీయ పరిస్థితులే ప్రధాన కారణం

పసిడి రేట్లు ఈ స్థాయిలో పెరగడానికి అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్త వాతావరణమే ప్రధాన కారణమని బులియన్ మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా ఇరాన్-అమెరికా మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం, గ్లోబల్ మార్కెట్లలో అనిశ్చితి, సురక్షితమైన ఇన్వెస్ట్‌మెంట్‌గా బంగారంపై ఇన్వెస్టర్లు మొగ్గు చూపడం వంటి పరిణామాల వల్ల పసిడి, వెండి ధరలు మళ్లీ ఆకాశాన్ని తాకుతున్నాయి.

నేటి బంగారం, వెండి ధరల వివరాలు

దేశీయంగా వివిధ వెబ్‌సైట్లలో నమోదైన వివరాల ప్రకారం శుక్రవారం ఉదయం సమయానికి ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధరపై రూ.10 పెరిగి రూ.1,49,740 వద్ద కొనసాగుతోంది. అదేవిధంగా 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.10 పెరిగి రూ.1,37,260 కి చేరింది. మరోవైపు, వెండి ధర కిలోపై రూ.100 మేర తగ్గి రూ.2,39,900 వద్ద విక్రయించబడుతోంది.

ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు

స్థానిక పన్నులు, రవాణా ఖర్చులు, డిమాండ్‌ను బట్టి వేర్వేరు నగరాల్లో బంగారం, వెండి రేట్లలో వ్యత్యాసం ఉంటుంది.

హైదరాబాద్: 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ.1,49,740 కాగా, 22 క్యారెట్ల బంగారం రూ.1,37,260గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.2,50,100 వద్ద కొనసాగుతోంది.

విజయవాడ, విశాఖపట్నం: ఈ రెండు నగరాల్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ.1,49,740గా, 22 క్యారెట్ల బంగారం రూ.1,37,260గా నమోదైంది. కిలో వెండి ధర రూ.2,50,100గా ఉంది.

ఢిల్లీ: దేశ రాజధానిలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ.1,49,870గా, 22 క్యారెట్ల బంగారం రూ.1,37,410గా ట్రేడ్ అవుతోంది. కిలో వెండి ధర రూ.2,39,900గా ఉంది.

ముంబై, బెంగళూరు: ఈ రెండు నగరాల్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ.1,49,740గా, 22 క్యారెట్ల బంగారం రూ.1,37,260గా ఉంది. కిలో వెండి ధర రూ.2,39,900గా కొనసాగుతోంది.

చెన్నై: చెన్నైలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ.1,50,010గా నమోదైంది. 22 క్యారెట్ల బంగారం రూ.1,37,510 వద్ద ఉంది. కిలో వెండి ధర రూ.2,50,100గా కొనసాగుతోంది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story