Gold Rate Today : పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు

Gold Rate Today : గత కొద్దిరోజులుగా ఆకాశమే హద్దుగా పెరుగుతూ వాహనదారులకు, సామాన్యులకు చుక్కలు చూపించిన పసిడి ధరలు ఇప్పుడు మెల్లమెల్లగా శాంతిస్తున్నాయి.

CR Reddy
Published on: 26 April 2026 7:00 AM IST
Gold Rate Today
X

Gold Rate Today 

Gold Rate Today : బంగారం కొనాలనుకునే వారికి ఇది నిజంగా ఊరటనిచ్చే వార్తే. గత కొద్దిరోజులుగా ఆకాశమే హద్దుగా పెరుగుతూ వాహనదారులకు, సామాన్యులకు చుక్కలు చూపించిన పసిడి ధరలు ఇప్పుడు మెల్లమెల్లగా శాంతిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాలు, డాలర్ విలువలో మార్పుల కారణంగా ఏప్రిల్ 26వ తేదీన బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్‎తో పాటు విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాల్లో ఇవాళ బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. 24 క్యారెట్ల (స్వచ్ఛమైన) 10 గ్రాముల బంగారం ధర రూ.1,54,040 వద్ద కొనసాగుతుండగా.. ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,41,200 వద్ద ఉంది. గత వారం రోజులతో పోలిస్తే ధరల్లో స్వల్ప తగ్గుదల కనిపించడం సామాన్యులకు ఊరటనిచ్చే అంశం.

దేశవ్యాప్తంగా ఇతర నగరాల పరిస్థితి

దేశ రాజధాని ఢిల్లీలో ధరలు ఇతర నగరాల కంటే కొంచెం ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,54,190 గా ఉంటే, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,41,350 పలుకుతోంది. ముంబై, కోల్‌కతా, బెంగళూరు, కేరళ రాష్ట్రాల్లో హైదరాబాద్ తరహాలోనే ధరలు ఉన్నాయి. ఇక చెన్నై విషయానికి వస్తే.. అక్కడ 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,54,910 వద్ద అత్యధికంగా కొనసాగుతోంది.

రికార్డు స్థాయిలోనే వెండి ధరలు

బంగారంతో పోటీ పడుతూ వెండి కూడా చుక్కలు చూపిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడలో కిలో వెండి ధర రూ.2,70,000 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు నగరాల్లో కిలో వెండి ధర కొంచెం తక్కువగా రూ.2,60,000 వద్ద ఉంది. పారిశ్రామిక అవసరాలు, ఇన్వెస్టర్ల డిమాండ్ కారణంగా వెండి ధరలు అంచనాలకు మించి పెరుగుతున్నాయి.

ధరల హెచ్చుతగ్గులకు కారణాలేంటి?

అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరగడం వల్ల ఇన్వెస్టర్లు సురక్షితమైన పెట్టుబడిగా పసిడి వైపు కంటే చమురు వైపు మొగ్గు చూపుతున్నారు. దీనికి తోడు భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కొంత తగ్గుముఖం పట్టడం కూడా బంగారం ధరలు తగ్గడానికి ఒక కారణం. అయితే, మనం కొనే ధరలో మేకింగ్ ఛార్జీలు, జీఎస్టీ అదనంగా ఉంటాయని, అందుకే నగరాల మధ్య రేట్లు మారుతూ ఉంటాయని గుర్తుంచుకోవాలి.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story