Gold Price Today : పసిడి ప్రియులకు ఊరట.. తగ్గిన బంగారం, వెండి ధరలు
Gold Price Today : తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా గోల్డ్ రేట్లు స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్, విజయవాడ నగరాల్లో ఇవాల్టి 22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం ధరలు చూద్దాం.
Gold Price Today
Gold Price Today : గత కొద్ది రోజులుగా రికార్డు రేట్లతో సామాన్యులకు చుక్కలు చూపిస్తున్న బంగారం ధరలు ఈరోజు కాస్త తగ్గాయి. నిన్నటివరకు భారీగా పెరిగిన గోల్డ్, సిల్వర్ రేట్లు ఈరోజు లైట్‌గా దిగివచ్చాయి. గ్లోబల్ మార్కెట్‌లో అమెరికా, ఇరాన్ దేశాల మధ్య జరుగుతున్న గొడవలు, ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఎకనామిక్ పరిస్థితుల వల్లే రేట్లలో ఈ మార్పులు వస్తున్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. ఈ ఎఫెక్ట్‌తోనే దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలు తగ్గుముఖం పట్టాయి.
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో ఈరోజు గోల్డ్ రేట్లు స్వల్పంగా తగ్గాయి. మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం.. ఇవాళ హైదరాబాద్‌లో 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ 10 గ్రాముల ధర పది రూపాయలు తగ్గి రూ.1,43,280గా నమోదైంది. అలాగే సాధారణంగా జ్యువెలరీ తయారీకి వాడే 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర కూడా పది రూపాయలు తగ్గి రూ.1,31,340 కి చేరింది. అయితే ఈ రేట్లకు లోకల్ మేకింగ్ ఛార్జీలు, జీఎస్టీ అదనంగా యాడ్ అవుతాయని గుర్తుంచుకోవాలి.
ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇవే రేట్లు కంటిన్యూ అవుతున్నాయి. విజయవాడ, విశాఖపట్నం (వైజాగ్) వంటి మెయిన్ సిటీస్‌లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 1,43,280 గా ఉండగా.. 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 1,31,340 వద్ద నడుస్తోంది. బంగారంతో పాటు వెండి ధర కూడా కాస్త తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి రేట్ వంద రూపాయలు తగ్గి రూ. 2,34,900 కి చేరింది. అయితే లోకల్ డిమాండ్ వల్ల తెలుగు రాష్ట్రాల్లో కొన్ని చోట్ల కిలో వెండి ధర రూ. 2,39,900 వద్ద సేల్ అవుతోంది.
దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర రూ. 1,43,430 గా ఉండగా.. 22 క్యారెట్ల రేట్ రూ. 1,31,490 వద్ద ఉంది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబైతో పాటు బెంగళూరు సిటీస్‌లో కూడా 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 1,43,280, అలాగే 22 క్యారెట్ల రేట్ రూ. 1,31,340 గా రికార్డైంది. అటు చెన్నైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ. 1,43,450 కాగా.. 22 క్యారెట్ల ధర రూ. 1,31,490 వద్ద కొనసాగుతోంది.
బంగారం, వెండి రేట్లు లోకల్ మార్కెట్ డిమాండ్, పన్నులు, గ్లోబల్ ఇన్ఫ్లేషన్ వంటి చాలా విషయాలపై ఆధారపడి రోజువారీగా మారుతుంటాయి. అందుకే కొనే ప్లాన్ ఉన్నవాళ్లు షాప్‌కి వెళ్లే ముందు ఒకసారి లేటెస్ట్ రేట్లను కనుక్కోవడం మంచిది.




