Gold Rate Today: పసిడి ప్రియులకు ఊరట.. రూ.9 వేలు పడిపోయిన బంగారం ధర
Gold Rate Today: తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు దక్షిణ భారతదేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలు గణనీయంగా తగ్గాయి.
Gold Rate Today
Gold Rate Today: బంగారం కొనుగోలుదారులకు గుడ్ న్యూస్. శ్రావణ మాసం, వివాహాల సీజన్ వేళ పసిడి ధరలు భారీగా దిగొస్తున్నాయి. అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావంతో గత నాలుగు రోజుల వ్యవధిలోనే తులం పై రూ.9 వేల వరకు ధర పతనమై కొనుగోలుదారులకు ఊరటనిచ్చింది. గ్లోబల్ మార్కెట్లలో మారుతున్న పరిణామాలు బంగారం, వెండి రేట్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. డాలర్ క్రమంగా పుంజుకోవడం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను పెంచవచ్చనే వార్తలు పసిడి మార్కెట్‌ను కలవరపెడుతున్నాయి. ఈ అంచనాల నేపథ్యంలో నిలకడగా ఉన్న పసిడి ధరలు ఒక్కసారిగా పతన బాట పట్టాయి. గడిచిన నాలుగు రోజులు చూస్తే బంగారం కొనుగోలుదారులకు అనుకూలమైన వాతావరణం కనిపిస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లో తులం బంగారం ఎంతంటే..?
తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు దక్షిణ భారతదేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలు గణనీయంగా తగ్గాయి. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్ఛమైన మేలిమి బంగారం ధర రూ.1,52,010 వద్ద ఉంటే.. ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల తులం బంగారం రేటు రూ.1,39,340 వద్ద ట్రేడ్ అవుతోంది. బెంగళూరు, చెన్నై నగరాల్లోనూ 24 క్యారెట్ల రేటు రూ.1,52,010 వద్ద కొనసాగుతుంటే.. 22 క్యారెట్ల ధర రూ.1,39,340గా పలికింది. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.1,52,160 దాకా పలుకుతోంది, 22 క్యారెట్ల రేటు రూ.1,39,490 వద్ద నమోదయింది.
దిగొస్తున్న వెండి వెలుగులు
బంగారంతో పాటు వెండి ధరలలో కూడా పతనం కనిపిస్తోంది. పారిశ్రామిక వినియోగం తగ్గడం, గ్లోబల్ ఇన్వెస్టర్లు వెనక్కి తగ్గడం ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఢిల్లీ, బెంగళూరు నగరాల్లో కిలో వెండి ధర రూ.2,44,900గా ట్రేడ్ అవుతుంటే, హైదరాబాద్, చెన్నై నగరాల్లో మాత్రం కేజీ వెండి ధర రూ.2,44,900 నుంచి రూ.2,49,900 పరిధిలో కొనసాగుతోంది.
కొనుగోలుదారులకు సరైన సమయమేనా?
ధరలు తగ్గుతుండటంతో రానున్న వివాహాల సీజన్ కోసం పసిడి, వెండి ఆభరణాలు చేయించుకోవాలనుకునే వారికి ఇది చక్కని అవకాశంగా విశ్లేషకులు భావిస్తున్నారు. అంతర్జాతీయంగా డాలర్ ఇండెక్స్ మరింత బలపడితే రాబోయే రోజుల్లో పసిడి రేట్లు మరికొంత తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి.




