Gold: రూ. 50 వేలు తగ్గిన బంగారం ధర.! ఇంకా ఎంత తగ్గనుందో.. వివరాలు ఇవిగో

Gold: బంగారం ధరలు భారీగా క్రాష్ అవుతున్నాయి. గత ఐదు నెలల వ్యవధిలోనే పది గ్రాముల బంగారం ధర ఏకంగా రూ. 50 వేలు పడిపోయి ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేస్తోంది.

Ravi
By Ravi
Published on: 30 Jun 2026 10:23 AM IST
Gold
X

Gold: రూ. 50 వేలు తగ్గిన బంగారం ధర.! ఇంకా ఎంత తగ్గనుందో.. వివరాలు ఇవిగో

Gold: పసిడి ప్రియులకు, పెట్టుబడిదారులకు ఇది కాస్త ఆందోళన కలిగించే వార్తే. ఎప్పుడూ పైపైకి వెళ్లే బంగారం ధరలు ఇప్పుడు అనూహ్యంగా క్రాష్ అవుతున్నాయి. గత కొన్ని నెలలుగా బంగారం ధరల్లో భారీ పతనం నమోదు అవుతోంది.

ఈ ఏడాది ఆరంభంలో గ్లోబల్ టెన్షన్స్ కారణంగా ఇన్వెస్టర్లు బంగారాన్ని అత్యంత సురక్షితమైన పెట్టుబడి ఆప్షన్‌గా భావించారు. దీంతో డిమాండ్ విపరీతంగా పెరిగి, ఓ దశలో 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ. 1,92,991 గరిష్ట స్థాయికి చేరింది.

అయితే, యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై నెలకొన్న అనిశ్చితి కారణంగా పసిడి ధరలు ఒక్కసారిగా దిగివచ్చాయి. గరిష్ట స్థాయితో పోలిస్తే ప్రస్తుతం 10 గ్రాముల ధర రూ. 1.43 లక్షలకు పడిపోయింది. అంటే దాదాపు ఐదు నెలల వ్యవధిలోనే పది గ్రాముల బంగారంపై ఏకంగా రూ. 50 వేలు మేర తగ్గింది.

అనూహ్యంగా పతనమవుతున్న ఈ ధరలు చూసి బంగారంపై పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్లు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. భవిష్యత్తులో ధరలు ఇంకా పడిపోవచ్చని వారు భయపడుతున్నారు. అయితే, మార్కెట్ నిపుణులు మాత్రం మరో వాదన వినిపిస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి పసిడి మార్కెట్ మళ్లీ పుంజుకుని ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని వారు అంచనా వేస్తున్నారు.

Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.

Next Story