Gold Price Today: బంగారం ప్రియులకు షాక్.. ఒక్కరోజే తులంపై రూ.3 వేలకు పైగా పెరిగిన పుత్తడి
Gold Price Today: బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా పెరిగాయి. హైదరాబాద్‌లో తులం 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,55,360కు చేరగా, వెండి కేజీ రూ.2.50 లక్షలుగా నమోదయ్యాయి.
Gold Price Today
Gold Price Today: దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా యూటర్న్ తీసుకున్నాయి. రోజురోజుకు తగ్గుతూ ఊరటనిచ్చిన పసిడి ధరలు ఒక్కసారిగా తులంపై మూడు వేల రూపాయలకు పైగా పెరిగి కొనుగోలుదారులకు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. బులియన్ మార్కెట్లో గత కొన్ని రోజులుగా పసిడి ధరలు క్షీణిస్తూ సామాన్యులకు తీపి కబురు అందించాయి. సెప్టెంబర్ 4వ తేదీన ధరలు ఒక్కసారిగా పెరిగి బిగ్ షాక్ ఇచ్చాయి. నిన్న ఒక్క రోజే తులం బంగారంపై సుమారు రూ. 3 వేలకు పైగా పెరుగుదల నమోదైంది. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.1,55,360 కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ఆభరణాల బంగారం ధర రూ.1,42,410 వద్ద కొనసాగుతోంది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,16,520 వద్ద ట్రేడవుతోంది.
ప్రధాన నగరాల్లో నేటి రేట్లు
తెలుగు రాష్ట్రాలలోని ప్రముఖ నగరాలైన హైదరాబాద్, విజయవాడల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,55,360, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,42,410, 18 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,16,520 వద్ద ఒకే రీతిలో కొనసాగుతున్నాయి. అదేవిధంగా ఆర్థిక రాజధాని ముంబై, బెంగళూరు నగరాల్లో కూడా ఇవే ధరలు అమల్లో ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,55,510, 22 క్యారెట్ల ధర రూ.1,42,560, 18 క్యారెట్ల ధర రూ.1,16,670గా నమోదు కాగా, చెన్నైలో 18 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,20,110 వద్ద విక్రయించబడుతోంది.
స్వల్పంగా పెరిగిన వెండి ధరలు
బంగారంతో పోలిస్తే వెండి కొనుగోలుదారులకు కొంత ఊరట లభించిందనే చెప్పాలి. వెండి ధరలు స్వల్పంగానే పెరిగి స్థిరంగా ముగిశాయి. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ. 2.50 లక్షల వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న ద్రవ్యోల్బణ పరిస్థితులు, అంతర్జాతీయ పరిణామాలు రాత్రికి రాత్రే దేశీయ మార్కెట్‌పై ప్రభావం చూపడం వల్ల ఈ అకస్మాత్తుగా ధరలు పెరిగాయని ఆర్థిక విశ్లేషకులు చెబుతున్నారు.




